హైదరాబాద్, జూన్ 30, (way2newstv.com)
ఏమ్మెల్యే సంపత్ కుమార్, అతని అనుచరులను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్దతి కి ఈ ప్రభుత్వం తిలొదకాలు దిద్దుతుంది. 70 ఏళ్ల పాలనలో ఏప్పుడైనా ఇంత అనిచివేత ఉన్నదా. నియంతృవ్వ దేశాలలో కూడా ఇలా చేయరు. పోలీసులతో ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం అవివేకమని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే ఇలాంటి నిర్బందాలు ఉండవని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి చర్యలు మరోసారి పునరుద్ధరణ కావొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి న దగ్గరినుంచి తమ సమస్యలు పరిష్కారించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.. వారి సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం డీలర్లను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం అడిగి అడిగి ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వారు సమ్మెకు దిగుతున్నారన్ని జానా అన్నారు. ప్రభుత్వం వెంటనే రేషన్ డీలర్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జానా రెడ్డి అన్నారు.
హౌస్ ఆరెస్టు దారుణం : జానారెడ్డి