ముంబై జూన్ 28(way2newstv.com)
విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్, మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ కర్వాన్ ట్రైలర్ రిలీజైంది. ముగ్గురు వ్యక్తులు.. రెండు శవాలు.. ఓ తప్పిపోయిన యువతి కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తి రేపుతున్నది. గంగోత్రి యాత్రకు వెళ్లి చనిపోయిన తన తండ్రి శవాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్లిన అవినాష్ కు తన తండ్రి మృతదేహం బదులు పొరపాటున మరో వృద్ధ మహిళ శవం దొరుకుతుంది. తన తండ్రి శవం పొరపాటున కొచ్చి వెళ్లిందని తెలుసుకొని అక్కడికి బయలు దేరిన తర్వాత.. ఊటీ వెళ్లి ఓ యువతి తప్పిపోయిందని అవినాష్‌కు తన తల్లి నుంచి సమాచారం అందుతుంది. తప్పిపోయిన యువతి తాన్యాగా మిథిల, వీళ్లకు సహకరించే డ్రైవర్ షౌకత్‌గా ఇర్ఫాన్‌ఖాన్ నటిస్తున్నారు. ఈ జర్నీలో వీళ్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది కథాంశం. ఈ ఆసక్తికర స్టోరీకి కాస్త హ్యూమర్‌ను జోడించాడు దర్శకుడు ఆకర్ష్ ఖురానా. ఈ మూవీ ఆగస్ట్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆసక్తి రేపుతున్న కర్వాన్ ట్రైలర్