రాంచరణ్ మూవీకి 300కోట్ల బడ్జెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాంచరణ్ మూవీకి 300కోట్ల బడ్జెట్

హైద్రాబాద్, జూలై 18 (way2newstv.com)
టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న రాజమౌళి మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక హీరోయిన్ కీర్తి సురేష్ కంఫర్మ్ అయినా సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ ఏడాది నవంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమా అనుకున్న దగ్గర నుండి అసలు ఈ సినిమా కథ ఏంటి అని చాలామంది రకరకాలుగా అనుకున్నారు. అయితే అవి ఏమి నిజం కాదని తేలిపోయింది. రీసెంట్ గా రామ్ చరణ్ వాటిపై స్పందించి అందులో నిజం లేదని స్పష్టం చేశాడు. దాంతో ఈ సినిమా కథ ఏంటో అన్న ఆసక్తి అందరిలో పెరుగుతూ వస్తోంది.లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇది బ్రిటిష్ కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తుంది. ఇందులో బ్రిటిష్ కాలానికి సంబంధించి కార్స్.. బైక్స్..కట్టడాలు.. ఇలా చాలానే ఇందులో చూపించి…అప్పటి సామాజిక వాతావరణం ఇందులో చూపించనున్నారంట. స్వాతంత్ర్య పోరాట వాసనలు ఈ సినిమాలో కనిపిస్తాయని అంటున్నారు. అందుకే ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అవుతుందని అంటున్నారు.
 
 
 
రాంచరణ్ మూవీకి  300కోట్ల బడ్జెట్