చిన్న సిన్మాలకు మంచి రోజులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిన్న సిన్మాలకు మంచి రోజులు

హైద్రాబాద్, జూలై 26, (way2newstv.com)
ఈ మధ్య చిన్న సినిమాల రిలీజస్ కు మంచి అవకాశాలే వస్తున్నాయి. గత రెండు వారాలుగా పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నాయి. ఈ వారం కూడా మూడు సినిమాలు బాక్పాఫీస్ బరిలో ఫోటి పడుతున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ తో వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి.  ఈ వారం మనముందుకు  ముచ్చటగా మూడు సినిమాలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా సాక్ష్యం బెల్లంకోండ శ్రీనివాస్,పూజహ్గదే  హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఇటవలే సెన్సార్ నుంచి ఓ సమస్యను ఎదురుకుంది.ఇప్పుడు సెన్సార్ నుంచి అడ్డు తోలగిపోవడంతో మంచి జోష్ మీద వుంది చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదలైన  ట్రైలర్ ఆడియన్స్ లో ఎక్స్ పటేషన్ ను పెంచేసింది. ఈ సినిమా ఈనెల 27 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరో సినిమా  కూడ ఈ వారం సందడి చేయడానికి రెడీ గా వుంది.  సుమంత్ అశ్విన్ నిహరిక జంటగా నటిస్తున్న సినిమా హ్యపీ వెడ్డింగ్ లక్ష్మణ్ కర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందు కు రాబోతుంది  తాజగా విడుదలైన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి ఎక్స్ పటేషన్ క్రీయేట్ చేసింది.ఈ చిత్రాని యూవి క్రియేషన్ పతాకం పై  MS రాజు నిర్మిస్తున్నారు.నూతన నటీనటులతో రాబోతున్న సినిమా పెదవి దాటని మాటోకటుంది. ఈ సినిమా ద్వార రావన్ రెడ్డి, పాయల్ వాధ్వా తెలుగు తెరకకు పరిచయం కాబోతున్నారు.ఫిల్మిం మంక్స్ ప్రైవెట్ లిమిటెడ్  బ్యానర్ పైవస్తున్న ఈ సినిమా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ చిత్రానికి టి. గురుప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. సీనియర్ నటుడు నరేష్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిప్తున్నాడు.
 
 
 
చిన్న సిన్మాలకు మంచి రోజులు