సైరాలో విలన్ గా కిషన్.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సైరాలో విలన్ గా కిషన్..

హైద్రాబాద్, జూలై 3, (way2newstv.com)
సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి 151వ సినిమా సై రా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఆంగ్లేయులకు, ఉయ్యాలవాడ నరసింహరెడ్డికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను భారీ బడ్జెట్ తో రాత్రి పూట తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ ఒక్క షెడ్యూల్ కే 42 కోట్ల పై మేర ఖర్చు అవుతున్నట్టుగా వినికిడి. ఇకపోతే పలు భాషల్లో విడుదల కాబోతున్న సై రా నరసింహారెడ్డి కోసం ఇతర భాషా నటీనటులు భాగస్వాములు అయ్యారు. తాజాగా సురేందర్ రెడ్డికి ఇష్టమైన మరో నటుడు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.
 
 
 
సైరాలో విలన్ గా కిషన్..
 
సురేందర్ రెడ్డి తెరకెక్కించిన పలు సినిమాల్లో విలన్ క్యారెక్టర్ చేసిన భోజ్ పురి స్టార్ నటుడు రవి కిషన్ కూడా నటిస్తున్నాడు. అయితే ఎప్పటి లాగే ఈ సినిమాలోనూ రవి కిషన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇక సై రా నరసింహారెడ్డి గురించి రవి కిషన్ మాట్లాడుతూ… చిరంజీవికి, తనకు మధ్యన సై రా లో భారీ ఫైట్ సీన్స్ ఉంటాయని… ఈ భారీ యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్ అని చెప్పిన రవి కిషన్… సినిమాలో తన పాత్ర చాలా కీలకమైనదని చెప్పాడు. ఇక ఈ సినిమాలో తనని తీసుకున్నందుకు గాను సురేందర్ రెడ్డికి థాంక్స్ చెప్పి ఆకాశానికెత్తేసాడు. సురేందర్ రెడ్డి తనకు గాడ్ ఫాధర్ లాంటి వారని… సురేందర్ రెడ్డి వల్లనే తానూ తెలుగు సినిమాల్లోకి ప్రవేశించానని చెప్పాడు. ఇక అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా వంటి భారీ నటీనటులు సై రా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని రామ్ చరణ్ 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు