కరుణానిధికి మోడీ పరామర్శ

చెన్నై, జూలై 28 (way2newstv.com)  
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తీవ్ర అనారోగ్యానికి గురై ఇంట్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోదీ.. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై స్టాలిన్‌కు ఫోన్ చేసి ఆరాతీశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం స్టాలిన్‌తో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. కరుణానిధి కుమార్తె కనిమొళితోనూ మోదీ సంభాషించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసిన మోదీ.. కరుణానిధికి అవసరమైన వైద్యంపై ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమని తెలిపారు.
 
 
 
కరుణానిధికి మోడీ పరామర్శ
Previous Post Next Post