కాంగ్రెస్ పై ముప్పేట దాడికి గులాబీ పార్టీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్ పై ముప్పేట దాడికి గులాబీ పార్టీ

హైద్రాబాద్, జూలై 3, (way2newstv.com)
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఫైర్ బ్రాండ్ కి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అండ్ టీం గట్టి హోమ్ వర్క్ మొదలు పెట్టేసింది. హరీష్ రావు, కేటీఆర్ లు కాకలు తీరిన డీకే ను ఎదుర్కొనేందుకు సరిపోరని కాబోలు నేరుగా టి బాస్ కేసీఆర్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. అన్న నడిచొస్తే… అన్నట్లు గద్వాల్ గట్టు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి అక్కడినుంచే కాంగ్రెస్ నేతలను తనదైన స్టయిల్ లో ఉతికి ఆరేశారు కేసీఆర్. కాంగ్రెస్ నేతలను నానా తిట్లు తిట్టేశారు. ఆయనకు తోడు మేనల్లుడు హరీష్ రావు చెలరేగిపోయారు. అంతకుముందే గులాబీ బాస్ కుమారుడు కేటీఆర్ అమ్మా లేదు బొమ్మా లేదు తామే గుంజుకుని తెలంగాణ తెచ్చుకున్నామంటూ సోనియాను తిట్టిపోశారు.కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ నేత డికె అరుణ ఒక్కరై తండ్రి, కొడుకు, అల్లుళ్ళను తిట్టిన తిట్టు తిట్టకుండా దుమ్ము దులిపారు. మంత్రి కేటీఆర్ తన అయ్యతో సోనియా కాళ్ళెందుకు మొక్కారని ప్రశ్నించారు. తెలంగాణ ను కాంగ్రెస్ ఇవ్వడం వల్ల కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరు లబ్ది పొందలేదన్నారు అరుణ. మహిళలను గౌరవించడం కూడా చేతకాదంటూ గులాబీ బాస్ కొడుకుని ఉతికారు. ఇక హరీష్ రావు ను వదల్లేదు అరుణ. గద్వాల్ పై అంత ప్రేమ ఉంటే నాలుగేళ్ళక్రితమే గట్టు ఎత్తిపోతలు మొదలు పెట్టి ఉంటే ఈ పాటికే నీరు వచ్చేదని ఏదైనా కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులే తప్ప టిఆర్ ఎస్ వచ్చాకా జరిగిందేమి లేదని విమర్శించారు అరుణ. ఎలక్షన్ సిత్రాల్లో మొత్తానికి గద్వాల్ గట్టు ఎత్తిపోతల పథకం కొత్త రాజకీయానికి తెరతీసింది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణాలో అటు టీఆరెస్ కాంగ్రెస్ పార్టీల నడుమ నేతల మధ్య పచ్చగడ్డి వెయ్యకుండానే భగ్గుమనే వాతావరణం నడుస్తుంది మరి
 
 
 
 కాంగ్రెస్ పై ముప్పేట దాడికి గులాబీ పార్టీ