లవ్ అండ్ హార్రర్ చిత్రంగా "ప్రేమ సౌధం". - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లవ్ అండ్ హార్రర్ చిత్రంగా "ప్రేమ సౌధం".

జూలై 3,(way2newstv.com)

మాజీ మిస్టర్ ఆంధ్రా బాల్వాన్ , ప్రాచి అధికారి హీరో  హీరోయిన్లు గా మజ్జును  సోహ్రబ్ మూవీస్ పతాకంపై మజ్జును రెహానా భేగం మజ్జును సోహ్రబ్ నిర్మాతలు గా ఎస్ కె మజ్జును దర్శకుడి గా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న లవ్ అండ్ హార్రర్  చిత్రం "ప్రేమ సౌధం". ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకోనుటోంది.ఈ సందర్బంగా ఎక్సుక్యూటివ్  ప్రొడ్యూసర్  ఎస్ ఎం ఎం ఖాజా మాట్లాడుతూ...ఈ చిత్రంలో ఒక ఫైట్ , ఆరు పాటలు ఉన్నాయి, పాటలు అద్ధుభుతంగా వచ్చాయి , శివరంజని మ్యూజిక్  ద్వారా జులై  11 న పాటలు విడుదల చేస్తున్నాము , ఆగస్టు 9 న సినిమాను రిలీజ్ చేయటానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నాము అని అన్నారు .   దర్శకుడు ఎస్ కె మజ్జును మాట్లాడుతూ ... ఒక చిత్రకారుడి జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా  ఈ చిత్ర కథ రాయటం జరిగింది , అను క్షణం ఉత్కంఠ భరితంగా సాగుతుంటుంది. సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ కు గురిచేస్తుంది . ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు . ఇంకా ఈ చిత్రంలో సాయి కిరణ్, మౌనిక , సత్య ప్రకాష్ ,కవిత , కోట శంకరావు , దిల్ రమేష్ , శివ సత్యనారాయణ , మిమిక్రి మూర్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : యాదగిరి ,ఎడిటింగ్ : సాయి శ్రీనివాస్ , ఫైట్స్ : సూపర్ ఆనంద్ , ఎక్సుక్యూటివ్  ప్రొడ్యూసర్ : ఎస్ ఎం ఎం ఖాజా , నిర్మాతలు : మజ్జును రెహానా భేగం మజ్జును సోహ్రబ్ , కథ , మాటలు , స్క్రీన్ ప్లే , సంగీతం , దర్శకత్వం : ఎస్ కె మజ్జును
 
 
 
లవ్ అండ్ హార్రర్  చిత్రంగా  "ప్రేమ సౌధం".