మీకే అంతుంటే..నాకెంత ఉండాలి.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మీకే అంతుంటే..నాకెంత ఉండాలి..

పశ్చిమగోదావరి, జులై 26,  (way2newstv.com)
ఎన్నడూలేని విధంగా వైసీపీ అధినేత జగన్ జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఇన్ డైరెక్ట్ గా నిత్యపెళ్లికొడుకు అని అన్నారు. జగన్ ఈ రేంజ్ లో విమర్శలు చేయడంతో.. వైసీపీ శ్రేణులే విస్తుపోయిన పరిస్థితి. మరీ ఇంత వ్యక్తిగతమైన దూషణలు రాజకీయనేతలు ఇటీవలిగా చేసుకున్న దాఖలాలు లేవు. కానీ.. జగన్ మొదలెట్టడంతో.. జనాలూ షాకయ్యారు. జనసేన వర్గమైతే.. జగన్ తీరును ఎండగడుతోంది. ఇక వైసీపీ వర్గం అయితే.. కొంత టెన్షన్ లోనే ఉంది. ఈ ఇష్యూ అటు తిరిగి..ఇటు తిరిగి.. తమకు మైనస్ అవుతుందేమోనని ఆందోళన పడుతోంది. కొన్నిరోజుల క్రితం.. జగన్ ప్రజా సమస్యలపై పోరాడకుండా అసెంబ్లీ నుంచి పారిపోయారని పవన్ విమర్శించారు. ఆ విమర్శపై ఓ విలేకరి స్పందన కోరడంతోనే జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి ధ్వజమెత్తారు. నాలుగేళ్లు టీడీపీ, బీజేపీతో కలిసి ఉన్న పవన్ కల్యాణ్ ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చారని జగన్ విమర్శించారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లడ్డమేంటని... ఆయన మాటలకు సమాధానాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పవన్ కు విలువలు లేవని విమర్శించారు. 
 
 
 
మీకే అంతుంటే..నాకెంత ఉండాలి..
 
రాజకీయంగా పవన్ పై జగన్ చేసిన విమర్శలను పెద్దగా పట్టించుకోకపోయినా.. ఆయన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంపై మాత్రం జనసేన సీరియస్ గా తీసుకుంది. స్వయంగా పవన్ కల్యాణే ఈ విమర్శలపై స్పందించారు. జగన్ కామెంట్స్ కు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. బలమైన వ్యక్తిని కాబట్టే జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని అన్నారు. మార్పుకోసం ప్రయత్నిస్తున్నాననే కోపంతో జగన్‌, బీజేపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకున్న మీకే అంతుంటే నిజాయితీ పరుడినైన నాకెంత ఉండాలి. రాజ్యాంగం రాసింది చంద్రబాబు, జగన్‌ కాదంటూ పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. ఇక జనసేన విషయానికొస్తే.. విపక్ష నేత తీరును ఎండగడుతోంది. జగన్ కు అసహనం పోవాలని సహనంతో ఉండాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. సంస్కారహీనంగా మాట్లాడకూడదన్న పవన్ కల్యాణ్ సూచనల మేరకు సంయమనంతో ఉన్నామని సంకుచిత ధోరణితో మాట్లాడే ప్రతిపక్షనేత ఉండడం బాధాకరమని అన్నారు. జగన్ ఒక అపరిపక్వమైన రాజకీయ నేత అంటూ ధ్వజమెత్తారు.