ఆరు నెలల పాటు గ్రామదర్శని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆరు నెలల పాటు గ్రామదర్శని

విజయవాడ, జూలై 7 (way2newstv.com)
వచ్చే ఆరు నెలలు గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాలన ప్రచారం ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి 15రోజులకు టార్గెట్లు పెట్టుకొని పనిచేయాలన్నారు. సచివాలయంలో హెచ్ వోడీలు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పక్క పార్టి బలోపేతంతోపాటు మరోపక్క  ప్రభుత్వ పాలన పై మరింతగా ఫోకస్ పెట్టారు. 
 
 
 
ఆరు నెలల పాటు గ్రామదర్శని
 
నాలుగేళ్ల ప్రభుత్వ పాలనను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గ్రామదర్శిని కార్యక్రమం సంక్షేమ పథకాలు అమలు, గ్రామాభివృద్దిలో ప్రజల స్పందన, ఈ-ఆఫీసు లాంటి అంశాలే ప్రధాన అజెండాగా సిఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో విడియో కాన్పరెన్స్ నిర్వహించారు. హెల్త్ , ఐటి, పంచాయితీ రాజ్ గ్రామీనాభివృద్దిలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం అధికారులకు సూచించారు. ప్రతి 15రోజులకు టార్గెట్స్ పెట్టుకొని పనిచేయాలన్నారు ముఖ్యమంత్రి.సర్వీస్ సెక్టార్, పర్యటక రంగంపై అభివృద్ది సాధించాల్సిన అవసరం వుందన్నారు ముఖ్యమంత్రి. పౌరసరఫరాల వస్తువుల పంపిణీలో మరింత దృష్టిపెట్టాలన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరంగా ఇబ్బందులు ఉన్నాయని సాకులు చెప్పకుండా  సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

మొత్తానికి నాలుగేళ్ల పాలనపై ఉన్నతాధికారుల సమావేశంలో అధ్యయనం చేసిన అనంతరం
సంక్షేమ కార్యక్రమాలను మరింత ప్రచారం చేయాలని ఆదేశించారు చంద్రబాబు.