బరిలో నిలిచేదెవరు..? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బరిలో నిలిచేదెవరు..?

ఆదిలాబాద్‌, జూలై 27 (way2newstv.com): 
ముందస్తు ఎన్నిక ల ప్రచారం ఊపందుకోవడంతో ఆయా పార్టీల నేతలంతా అప్రమత్తమవుతున్నారు. అనుకున్నట్లుగానే ఎన్నికలే వస్తే ఆదిలాబా ద్‌ పార్లమెంట్‌ బరిలో ఎవరన్నదే ప్రస్థుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. జిల్లాలో జరుగుతున్న తాజా పరిణామాలను అంచనా వేసుకుంటూ ప్రధాన పార్టీల నేతలు పావు లు కదుపుతున్నారు. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా పార్లమెంట్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఖాతాల్లో వేసుకుంది. ప్రస్థుత ఎంపీ గేడం నగేష్‌ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దాదాపుగా ఆయన వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల బరిలో ఉండరన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎంపీ నగేష్‌ సైతం పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటేందుకుముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ముందస్తు ప్రచారం పెరిగి పో వడంతో మరింత పట్టు బిగిస్తున్నాయి. కుల, మత, తెగల వారి గా ఓటర్‌ జాబితాలను సిద్ధం చేస్తూ అంచనాలు వేసుకుంటున్నారు. జిల్లా పార్లమెంట్‌ స్థానం ఎస్టీ రిజర్వ్‌డు కావడంతో ము ఖ్యంగా ఆదివాసీ లంబాడా తెగలకు చెందిన బలమైన నేతల కోసం అన్ని పార్టీలు దృష్టి సారించాయి.
 
 
 
బరిలో నిలిచేదెవరు..? 
 
మునుపెన్నడు లేని విధంగా ఈ సారి ఆదివాసీల ఉద్యమం జిల్లాలో ఉదృతంగా మారడంతో ఎక్కువగా ఆదివాసీ నేతల వైపే ఆయా పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఆదివాసీ వర్గాలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి నుంచే ఎంపీ అభ్యర్థులు ఎవరన్న ప్రచా రం జోరుగా సాగడంతో అన్ని పార్టీల్లో ఆశావాహుల సంఖ్య పెరిగి పోతుంది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నేతలు ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉంటుండగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు టీడీపీ నేతలు రాష్ట్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు ముమ్మర ప్ర యత్నాలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల బరి నుంచి ఎంపీ నగేష్‌ తప్పుకుంటే పార్టీ నుంచి ఎవరిని ఎంపీ అభ్యర్థిగా దింపాలనే అయోమయ పరిస్థితులు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో కనిపిస్తోంది. గత ఎనిమిది మాసాల క్రితం టీడీపీని వదిలి అధికార పార్టీ తీర్థం పుచ్చుకు న్న మాజీ ఎంపీ రాథోడ్‌రమే్‌షతో పాటు ఖానాపూర్‌ ఎమ్మెల్యే భర్త శ్యాంనాయక్‌ ఎంపీగా పోటీ చేసేందుకు తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో ఒకరిద్దరు గిరిజన నేతలు పార్లమెంట్‌ స్థానం పై కన్నెసినట్లు ప్రచారం సాగుతుంది. రాథోడ్‌రమేష్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీనే నమ్ముకొని ముందుకు సాగుతుండగా శ్యాంనాయక్‌ మాత్రం జిల్లాకు చెంది న ఇద్దరు మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయిలో కీలకంగా పని చేస్తున్న మరో మంత్రి హారీ్‌షరావు అండదండలను నమ్ముకుంటున్నాడు. వీరిద్దరు లంబాడా తెగకు చెందిన నేతలే కావడంతో అవసరమైతే ఆదివాసీ నేతైనా ఎంపీ నగే్‌షనే బరిలో దింపే అవకాశాలు లేక పోలేదంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగి పోతున్న నేత ల రాజకీయ భవితవ్యంపై స్పష్టత కనిపించడం లేదు.
అధికార పార్టీ దూకుడును ఎదుర్కొనేందుకు సరైన ఆదివాసీ నేతలను ఎన్నికల బరిలో దింపడమే మంచిదని భావిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే ఆదివాసీ నేతల వైపు ఆ లోచనలు మొదలు పెట్టింది. టీడీపీ పార్టీని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరి పోయిన బోథ్‌ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తుడుందెబ్బ అధ్యక్షుడు సోయంబాపురావ్‌ను బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా పార్లమెంట్‌ స్థానానికే పోటీ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం ఆ పార్టీకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఎంపీగా గెలుపొంది ఆదివాసీల సమస్యలను దేశ స్థాయిలో చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉండడంతో ఆయన కూడా ప్రయత్నాలు మొద లు పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నరే్‌షజాదవ్‌ కూడా ఢిల్లీ పెద్దలను తరుచు కలుస్తూ తన రాజకీయ భవితవ్యం పై భరోసా పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కాం గ్రెస్‌ పార్టీలో గ్రూపు విభేధాల కారణంగా ఎవరి సన్నిహితులకు వారే మద్దతునిచ్చే ప్రయత్నాలు చేస్తున్న చివరి క్షణంలో ఏం జ రుగుతుందో ఊహించడం కష్టంగా ఉంటుందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలలో నువ్వా? నేనా? అనే పోటీ కనిపిస్తున్న బీజేపీ, టీడీపీలు వేచి చూసే ధోరణితో ఉన్నా యి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సల పోటీకి తట్టుకునే బలమైన అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్నాయి. బీజేపీ పూర్తిగా మోదీ ఈమెజ్‌ను నమ్ముకొని కనిపిస్తుండగా టీడీపీ మాత్రం ఏం చెప్పుకోలేక చతికిల పడి పోతోంది. యువతలో ఉన్న మోదీ ఈమెజ్‌ను చూపు తూ బలమైన నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నా ఆ స్థాయి నేతలెవరూ అందుబాటులో లేకపోవడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే మారుతుంది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌ నియోజక వర్గంతో పాటు రెండు మూడు చోట్ల కొం తబలంగా ఉన్న బీజేపీ ఆర్థిక పరపతితో పాటు ప్రజల్లో బలము న్న నేతల కోసం వేట మొదలు పెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆ పార్టీ పెద్దలు పదే పదే చెబుతున్న నేపథ్యంలో కొందరు నేతలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ఎన్‌ఆర్‌ఐలతో పాటు మరో గిరిజన నేత బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కప్పు డు జిల్లాలో తిరుగులేని విజయం సాధించిన టీడీపీకి ప్రస్తుతం అభ్యర్థులెవరూ పోటీ చేసేందుకు ముందుకు రాక పోవడం గం దరగోళ పరిస్థితులకు దారి తీస్తుంది. మొత్తానికి ముందస్తు ఎ న్నికలు ఉండే అవకాశం ఉందని అన్ని పార్టీలు పట్టుకోసం తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టాయి.