వివాదం రేపిన లోకేష్ ప్రకటన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వివాదం రేపిన లోకేష్ ప్రకటన

కర్నూలు, జూలై 11, (way2newstv.com)
మంత్రి లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనలో ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్ధుల పేర్లు ప్రకటించడం జిల్లా తెలుగు దేశం పార్టీలో కలకలం రేపింది. తాజాగా ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యాలకు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రతిస్పందించడం సంచలనం అయింది.  టీజీ వెంకటేష్ మాట్లాడుతూ  ప్రభుత్వ కార్యక్రమంలో  మంత్రి నారా లోకేష్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం ఆశ్చర్యమేసిందని అన్నారు. లోకేష్ ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ  ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్ధులపై సియం తుది నిర్ణయం తీసుకున్నాక స్పందిస్తాన్నారు. మంత్రి నారా లోకేష్ ను ఎస్వీ మోహన్ రెడ్డి హిమ్నటైజ్ చేశాడని అనుకుంటున్నానని అన్నారు. దాంతో ఎస్వి మోహన్ రెడ్డి స్పందించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై మంత్రి నారా లోకేష్ ప్రకటనే ఫైనల్ అని అన్నారు. పరిస్థితులను బట్టి మంత్రి నారా లోకేష్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని అంటూనే ఎంపీ టిజి వెంకటేష్, టిజి భరత్ తో ఎలాంటి విభేదాలు లేవు, వారితో కలసి పనిచేస్తానని అన్నారు. ఇద్దరి వ్యాఖ్యాలు, ప్రతి వ్యాఖ్యలను  జిల్లా పార్టీ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి.
 
 
 
వివాదం రేపిన లోకేష్ ప్రకటన