కాలు బెణకడంతో ఇబ్బందిపడుతున్న పవన్ కల్యాణ్

ఏలూరు, జూలై 25, (way2newstv.com)
పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోరాట యాత్రకు వెళ్ళిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రే కాలు బెణికింది. భీమవరంలోని ఎన్.డి.ఫంక్షన్ హాల్ లో బస చేశారు. మంగళవారం  పవన్ కల్యాణ్ ను కలిసేందుకు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు ఆ ప్రాంగణానికి చేరుకున్నారు.  వారితో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో నేల తడిగా ఉండటంతో కాలు స్కిడ్ అయింది. ఫలితంగా అయన  కుడి కాలు బెణికింది. వెంటనే బ్యాండేజీతో కట్టు వేశారు. నొప్పితోనే జన సైనికుల్ని కలిసి మాట్లాడారు.  వైద్యులు వచ్చి పరీక్షించారు. నొప్పి నివారిణులు వాడాలని చెప్పారు. కాలుకి క్యాప్ వేసి స్వల్ప విశ్రాంతి అవసరం అని సూచించారు. బుధవారం పర్యటనలో భాగంగా  పర్యటనలో జనసేన వీర మహిళా విభాగంతో పవన్ సమావేశమయ్యారు. బుధవారం  విశ్రాంతి తీసుకుంటున్న ఆయన, గురువారం నుంచి యాత్ర కొనసాగిస్తారని సమాచారం.
 
 
 
కాలు బెణకడంతో ఇబ్బందిపడుతున్న పవన్ కల్యాణ్ 
Previous Post Next Post