ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులు కావలెను - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులు కావలెను

హైద్రాబాద్, జూలై 28, (way2newstv.com)
 ప్రధాన పార్టీల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధమేనని సవాల్‌ విసురుకుంటున్నా కొన్నిచోట్ల దీటైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు వెతుకులాట ప్రారంభించాయి. పోటీ చేసేందుకు గల్లీకి ఇద్దరుముగ్గురు చొప్పున ఉత్సాహం చూపుతున్నా ప్రజాదరణతో పాటు ఆర్థికంగా ఉన్నారా లేదా అన్నది చూస్తున్నాయి. డబ్బు పెట్టగలిగేవాడికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నాయి. గతంలో గెలిచిన ఒకరిద్దరు కొత్తతరం నేతలూ ఆ పార్టీ నాయకుడికి ఉన్న ఆదరణతో గట్టెక్కగలిగినా, ఇప్పుడా ఆ పరిస్థితి లేదన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. దీంతో దీటైన అభ్యర్థుల వేటలో పార్టీలు పడ్డాయి. ఇది డబ్బున్నవారికి వరప్రసాదంగా కలిసొచ్చినట్లయింది. టికెట్టు ఇస్తే ఎంతైనా ఖర్చు పెడతామని పార్టీ నాయకత్వాల ముందు మీసం మేలేసి తొడలు కొడుతున్నారు. 
 
 
 
ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులు కావలెను
 
ఇందులో కొంతమందికి అవకాశం ఇచ్చినా మరి కొందరిని మరోచోట ఉపయోగించుకుం టామ ని హామీ ఇస్తున్నట్టు తెలిసింది. సరైన అభ్య ర్థుల లేనిచోటే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఇలాంటి స్థానాల్లో గెలిచేందుకు అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న కొందరి నేతలపై టీఆర్‌ఎస్‌ గాలం వేయగా, గులాబీ పార్టీలో ఉన్న అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నారు. తటస్థులు, ఆర్థికంగా బాగున్న వారికి టికెట్టిచ్చినా గెలిపించుకునే భారాన్ని సంబంధింత పార్టీ నాయకుడే వేసుకుంటున్నారని తెలిసింది. డబ్బే ప్రధానం కావడంతో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఆందోళన కనిపిస్తున్నది. తమ సీటుకు ఎక్కడ ఎసరపెడతారమోనన్న భయం నెలకొంది. టీడీపీ, బీజేపీ, టీజేఎస్‌ల్లో ఈ పోటీ ఎక్కువ లేకపోయినా కాస్తోకూస్తో డబ్బున్నవారికే ఇవ్వనున్నాయి. ఇండిపెండెట్లలోనూ డబ్బున్నవారు పోటీలో ఉంటున్నారు. సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర వామపక్షాలకు ఈ సమస్య ఉండదు. ఇక బీఎల్‌ఎఫ్‌ నిజాయితీ ఉన్న అభ్యర్థులను అన్వేషిస్తున్నది.టీఆర్‌ఎస్‌పార్టీలో పోటీ చేసేందుకు ఎంతోమంది తహతహలాడుతున్నారు. టీఆర్‌ఎస్‌లోనూ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలోనూ మొదటిసారి గెలిచినవారే ఎక్కువమంది ఉన్నారు. తిరిగి వారందరికీ టికెట్టు ఇవ్వాలంటే టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి పెద్ద సవాల్‌ లాంటింది. వారిలో మళ్లీ ఎంతమంది గెలుస్తారని చెప్పడానికంటే, చాలామందికి డబ్బుకు కొదవలేదు. దీంతో సహజంగానే పోటీ ఎక్కువగా ఉన్నది. పోటీ చేయడానికి చాలామంది క్యూలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలను ఓడించడానికి ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలన్నదే టీఆర్‌ఎస్‌ ఆలోచనగా ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష అభ్యర్థులపైనే కన్నేసినట్టు తెలిసింది. దీనికోసం బేరాలు నడుస్తున్నాయని సమాచారం. ఏదైనా ఎన్నికల సమయంలోనే తెలుస్తాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 70 నుంచి 80 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్‌పార్టీ అంటున్నది. ముఖ్యంగా ఆ పార్టీకి సీనియర్లు ఎక్కువమంది ఉండటం విశ్లేషం. కొంతమంది గులాబీ తీర్థం పుచ్చుకున్నా చాలామంది కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసమే డజను మందిపైగా పోటీపడుతున్నారు. 2014 ఎన్నికల్లో సెంటిమెంటుతో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచిందనేది కాంగ్రెస్‌ వాదన. ఈ సారి ఆ పప్పులు ఉడకబోవని పార్టీ నేతలు అతిగా అంచనా వేస్తున్నారు. అయితే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల కొత్తవారు పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్టు రాని అసంతృప్తులపైనా కన్నేసి ఉంచినట్టు తెలిసింది.