మళ్లీ ప్రేమ కధా చిత్రాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ ప్రేమ కధా చిత్రాలు

హైద్రాబాద్, జూలై 10, (way2newstv.com) 
తెలుగులో ప్రేమ కథల ట్రెండ్ మళ్లీ మొదలవుతోంది. తొలి ప్రేమ, తేజ్ ఐ లవ్యూ ఇప్పటికే విడుదల కాగా.. ఆర్ఎక్స్ 100, పరిచయం సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విరాట్ – సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న ‘పరిచయం’ ట్రైలర్‌ను హీరో నితీన్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. యదార్థ ప్రేమ కథ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ చెన్నా తెరకెక్కించారు. నన్ను చూడని నీ కళ్లంటే చాలా ఇష్టం, నాకు వినిపించని నీ మాటలంటే చాలా ఇష్టం.. అంటూ మొదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. పెద్దలకు ఇష్టం లేని తమ ప్రేమను ప్రేమికులు ఎలా గెలిపించుకున్నారనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది. ప్రేమను ఫీలవ్వాలి కానీ.. ప్రేమించినందుకు కాదు.. ప్రాణంతో ఉన్న ప్రతీ క్షణం నీ చేయి వదలను, వదిలిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను. నీ కన్నీళ్లు ఎంత విలువైనవో.. నిన్ను ప్రేమించిన వాళ్ల కన్నీళ్లు అంతకంటే విలువైనవి. మనం ప్రేమిస్తున్నాం అనుకోవడం కంటే.. మనం ప్రేమిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయ్ సార్.. లాంటి డైలాగ్స్ బాగా పేలాయ్. మళ్లీ ప్రేమ కధా చిత్రాలు