ఏపీ వరదల్లో చిక్కుకున్న 300 మంది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ వరదల్లో చిక్కుకున్న 300 మంది

విజయవాడ, ఆగస్టు 21, (way2newstv.com)
భారీ వర్షాలు, వరదలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో హై అలర్ట్ విధించింది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు తెలంగాణలోని భూపాల్‌పల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదారి ఉప్పొంగి ప్రవహిస్తోంది. తెలంగాణ, ఏపీ సరిహద్దులో 300 భక్తులు చిక్కుకుపోయారు. తమకు సాయం అందించాలని అర్థిస్తున్నారు. తెలంగాణలోని అశ్వరావుపేట, ఏపీలోని గుబ్బాల ప్రాంతాల మధ్య ఉన్న మంగమ్మ దేవాలయ సందర్శనకు కొంత మంది భక్తులు వెళ్లారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు రహదారులు పైనుంచి ప్రవహిస్తుండటంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పడవలు కూడా ఉపయోంగించొద్దని అధికారులు ఆదేశించారు. దీంతో వీరంతా బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
 
 
 
ఏపీ వరదల్లో చిక్కుకున్న 300 మంది