సెప్టెంబర్ 5వ తేదీ వరకు గృహనిర్బంధంలో వరవరరావు:సుప్రీంకోర్టు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సెప్టెంబర్ 5వ తేదీ వరకు గృహనిర్బంధంలో వరవరరావు:సుప్రీంకోర్టు

న్యూడిల్లీ ఆగష్టు 30 (way2newstv.com)
భీమా-కోరేగావ్ ఘటనలకు సంబంధించి నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో విరసం నేత వరవరరావుతో సహా ఐదుగురిని అరెస్టు చేసిన ఐదుగురు హక్కుల కార్యకర్తలను సెప్టెంబర్ 5వ తేదీ వరకు గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేసించింది. అయితే వారి అరెస్టులపై స్టే విధించేందుకు నిరాకరించింది. చరిత్ర పరిశోధకురాలు రొమిలా థాపర్ మరికొందరు ఈ కేసు దాఖలు చేశారు. నక్సల్స్‌తో సంబదాలు ఉన్నాయనే ఆరోపణలతో విరసం నేత వరవరరావుతో సహా ఐదుగురిని పుణే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీవాల్వ్ వంటిదని, దాన్ని నొక్కిపెడితే ప్రెషర్ కుక్కర్ బద్దలవుతుందని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఇద్దరిని ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉంచారని, మొత్తం అందరినీ గృహనిర్బంధంలో ఉంచాలని కోర్టు తెలిపింది. గురువారానికి కేసు విచారణను వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. సెప్టెంబర్ 5లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
 
 
 
సెప్టెంబర్ 5వ తేదీ వరకు గృహనిర్బంధంలో వరవరరావు:సుప్రీంకోర్టు