ఏడాదిలో 77 కోట్లు దాటేసిన ప్రియాంక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏడాదిలో 77 కోట్లు దాటేసిన ప్రియాంక

ముంబై, ఆగస్టు 15, (way2newstv.com)
ఇన్నాళ్లూ బాలీవుడ్ హీరోలు మాత్రమే తమ భారీ సంపాదనతో వార్తల్లో నిలిచే వాళ్లు. ఇప్పుడు హీరోయిన్లకు కూడా టైమొచ్చింది. వీళ్లు కూడా పదుల కోట్ల రూపాయల సంపాదనతో వార్తల్లోకి వస్తున్నారు. తాజాగా నటీమణి ప్రియాంక చోప్రా సంపాదన గురించి ‘ఫోర్బ్స్’ పత్రిక ఒక ఆసక్తిదాయకమైన కథనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం.. ప్రియాంక గత ఏడాదిలో ఏకంగా 77 కోట్ల రూపాయల మొత్తాన్ని సంపాదించింది. సినిమాల ద్వారా, ఎండార్స్‌మెంట్ డీల్స్ ద్వారా ప్రియాంక ఈ మొత్తాన్ని సంపాదించిందని ఫోర్బ్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటీమణికి హాలీవుడ్‌లో కూడా అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. అమెరికన్ సినిమాల్లో.. టీవీ షోల్లో మెరుస్తోంది ప్రియాంక. ఈ నేపథ్యంలో ఈమె సంపాదన గణనీయంగా పెరిగినట్టుగా తెలుస్తోంది. స్థూలంగా 2017 సంవత్సరంలో ప్రియాంక చోప్రా 77 కోట్ల రూపాయల మొత్తాన్ని సంపాదించిందని సమాచారం. ఈ మేరకు ప్రియాంక సంపాదనను ఫోర్బ్స్ అంచనా వేసింది. అయితే ఇందులో ప్రియాంక చోప్రా భారీగా పన్నును చెల్లించిందని కూడా ఆ పత్రిక పేర్కొంది. పన్నులన్నీ పోనూ ప్రియాంక గత ఏడాదిలో దాదాపు 56 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్లిందని అంచనా. ఇది కూడా భారీ మొత్తమే. ప్రస్తుతం ప్రియాంక వివిధ సినిమాలతో బిజీగా ఉంది. హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌తో ప్రేమాయణాన్ని నడిపిస్తోందనే ప్రచారాన్ని కూడా పొందుతోంది. ఏడాదిలో 77 కోట్లు దాటేసిన ప్రియాంక