అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి జన్మదిన శుభాకాంక్షలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ ఆగష్టు 17 (way2newstv.com)
 దేశ రాజధాని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పుట్టిన రోజు ఈరోజు. ఈసందర్భంగా ఆయనను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.‘దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఆయనకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్‌కు కేజ్రీవాల్‌ స్పందిస్తూ ‘థాంక్యూ సో మచ్‌ సర్‌’ అని సమాధానం ఇచ్చారు. కేజ్రీవాల్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తదితరులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
 
 
 
అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి జన్మదిన శుభాకాంక్షలు
 
కాగా సీనియర్‌ నేత, మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేశారు. పార్టీ కార్యకర్తలెవరూ తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని కోరారు. కేజ్రీవాల్‌ ఈరోజు 51వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. వాజ్‌పేయీ దిల్లీలోని ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నందున ఆయనను పరామర్శించేందుకు ఈరోజు కేజ్రీవాల్‌, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాలు ఎయిమ్స్‌కు వెళ్లారు.అటల్‌జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వినడం చాలా బాధగా ఉంది.. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. తన‌ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించొద్దని పార్టీ కార్యకర్తలను, శ్రేయోభిలాషులను కేజ్రీవాల్‌ కోరుతున్నారని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు నాగేంద్ర శర్మ వెల్లడించారు. అలాగే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు దయచేసి ఎవ్వరూ ఇంటికి రావొద్దని తెలియజేయాలని కేజ్రీవాల్‌ చెప్పారని నాగేందర్‌ మీడియాకు తెలిపారు.