రీల్ లైఫ్లో నాగ్, సమంత కాంబినేషన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రీల్ లైఫ్లో నాగ్, సమంత కాంబినేషన్

హైద్రాబాద్, ఆగస్టు 17, (way2newstv.com)
నాగ చైతన్య – సమంతలు పెళ్లి కాక ముందు ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం సినిమాలలో జోడిగా నటించారు. అందులో ఆటో నగర్ సూర్య తప్ప మిగతా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. అయితే పెళ్లి తర్వాత ఈ జంట నటించబోయే సినిమాపై అందరిలో బోలెడంత క్యూరియాసిటీ నెలకొంది. దర్శకుడు మారుతీ తన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో నాగ చైతన్యకి జోడిగా సమంతని నటింపచేయాలనే ప్రయత్నాలు చేసాడు. కానీ మారుతీ ప్లాన్ వర్కౌట్ అవ్వక.. ఆ సినిమాలో చైతుకి జోడిగా అను ఇమ్మాన్యువల్ ని తీసుకున్నాడు. అయితే చైతు – సామ్ ల జంటతో కోన వెంకట్… శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని సెట్ చేసాడు.నాగ చైతన్య – సమంత శివ నిర్వాణ డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో భార్యాభర్తలుగా కనబడనున్నారట. 
 
 
 
రీల్ లైఫ్లో నాగ్, సమంత కాంబినేషన్ 
 
రియల్ లైఫ్ భార్య భర్తలు, రీల్ లైఫ్ లో అవే పాత్రలో కనబడతారంటేనే ఆ సినిమాపై అంచనాలతో పాటుగా క్రేజ్ కూడా పెరిగింది. మామూలుగానే సామ్ – చైతుల జోడి ఒక సినిమాలో కలిసి నటిస్తే ఆ సినిమా కి ఆటోమాటిక్ గా విపరీతమైన క్రేజ్, హైప్ వచ్చేస్తుంది. ఇకపోతే చైతు – సామ్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడో మొదలైంది కానీ… రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.అయితే ఈ సినిమాకి గతంలో ప్రేయసి అనే టైటిల్ ప్రచారంలోకొచ్చింది. కానీ తాజాగా చైతు – సామ్ లు నటించబోయే ఈ సినిమా టైటిల్ మజిలి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి భార్య భర్తలుగా నటిస్తున్న వీరి జీవితాల్లోకి ఒక అమ్మాయి రావడంతో.. ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం.. ఆ తర్వాత ఆ సమస్యలను పరిష్కరించుకుని ఒక్కడవడం అనే కథతో ఈ సినిమాని శివ నిర్వాణం తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకి మజిలీ అనే టైటిల్ బాగుంటుందంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటి దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు మూడో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోనుంది.