ప్రకృతి ఆగ్రహిస్తే కేరళ పరిస్థితి వస్తుంది రైతులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖాముఖి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకృతి ఆగ్రహిస్తే కేరళ పరిస్థితి వస్తుంది రైతులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖాముఖి

విజయవాడ, ఆగస్టు 23, (way2newstv.com)
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం నర్శింగిపాలెంలో ప్రకృతి వ్యవసాయ  క్షేత్రాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం నాడు పరిశీలించారు. తరువాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు.  రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభావాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సొంతంగా వ్యవసాయం చేస్తున్న రైతులను కలవాలని ఇక్కడికి వచ్చాను. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది. రైతులంతా ప్రకృతి వ్యవసాయం పట్ల మమేకం అవ్వాలని అన్నారు. తరువాత ఎస్ఎన్ పాలెం బాలాజీ ఫంక్షన్ హాల్లో  రైతులు ఏర్పాటు చేసిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్  ముఖాముఖి కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గోన్నారు. 
 
 
 
ప్రకృతి ఆగ్రహిస్తే కేరళ పరిస్థితి వస్తుంది
రైతులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖాముఖి
 
 ఈ కార్యక్రమానికి మంత్రులు నక్కా ఆనంద్ బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ లక్ష్మికాంతం, ఇతర అధికారులు హజరయ్యారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రైతుల అనుభవాలు తెలుసుకోవాలని ఉంది. రాష్ట్రంలో ఎక్కడ సేంద్రియ వ్యవసాయం  సాగు  చేస్తున్నా అక్కడికి వెళ్తాను. తాతల అనుభావాలు నాకు వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేసింది. ప్రకృతికి ఆగ్రహం వస్తే కేరళ పరిస్థితి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి పూర్తిగా కనుమరుగవుతుంది. సుభాష్ పాలేకర్ అనుభవాలతో వ్యవసాయం చెయ్యాలని సూచించారు. దేశంలో రైతులకు సేంద్రియ  వ్యవసాయంపై ప్రోత్సాహం ఇవ్వాలని ప్రధాని మోడీకి చెప్పాను. భారతీయ జీవన విధానాన్ని అందరూ పాటించాలి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆదుకోవాలి. నేను రాజకీయల్లో లేను అందుకోసమే రాజకీయాలు మాట్లాడనని అన్నారు. యువకులు, ఉద్యోగులు, వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకోవాలి. సీఎం చంద్రబాబును వ్యవసాయాన్ని ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. శాస్త్రవేత్తలు రైతులతో కలిసి పరిశోధనలు చెయ్యాలని అయన అన్నారు. పట్టిసీమ పుణ్యం కృష్ణా డెల్టాకు నీరు అందుబాటులోకి వచ్చి పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం అభివృద్ధి చెందితే ఒక బ్రాండ్ లా మారుతుంది. ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ ఫుడ్స్ కి ఆదరణ పెరుగుతుందని అన్నారు.