ఆట బాలోత్సవోం బ్రోచర్ ను విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బాలోత్సవ్ పిల్లలకు కళలపై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుంది పిల్లల్లో ఈ ఉత్సవం మంచి జ్ణాపకంగా మిగిలిపోయేలా ఉత్సవాలు నిర్వహించాలన్న డిప్యూటీ సిఎం కడియం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆట బాలోత్సవోం బ్రోచర్ ను విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బాలోత్సవ్ పిల్లలకు కళలపై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుంది పిల్లల్లో ఈ ఉత్సవం మంచి జ్ణాపకంగా మిగిలిపోయేలా ఉత్సవాలు నిర్వహించాలన్న డిప్యూటీ సిఎం కడియం

హైదరాబాద్, ఆగస్టు 22 (way2newstv.com)
ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం  సంయుక్తంగా నవంబర్  10, 11వ తేదీల్లో నిర్వహించనున్న ‘‘ఆట బాలోత్సవ్’’ బ్రోచర్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు మినిష్టర్స్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు. పిల్లల్లో చదువు ఒక్కటే కాకుండా వివిధ కళల పట్ల అవగాహన కల్పించడంలో ఈ ఉత్సవాలు ఉపయోగపడుతాయన్నారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ణాపకంగా మిగిలిపోతుందన్నారు.  ఈ ఉత్సవాల్లో దేశంలోని 10 రాష్ట్రాల పిల్లలు, కళాకారులు పాల్గొంటున్నట్లు ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 24 అంశాలు, 54 విభాగాల్లో వివిధ కార్యక్రమాలను రూపొందించామన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి భాగస్వామికి ఒక సర్టిఫికేట్ అందిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు, పిల్లలకు భోజన వసతి కల్పించామన్నారు.
 
 
 
ఆట బాలోత్సవోం  బ్రోచర్ ను విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 
బాలోత్సవ్ పిల్లలకు కళలపై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుంది
పిల్లల్లో ఈ ఉత్సవం మంచి జ్ణాపకంగా మిగిలిపోయేలా ఉత్సవాలు నిర్వహించాలన్న డిప్యూటీ సిఎం కడియం