చెన్నైకి మకాం మార్చేసిన శ్రీ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చెన్నైకి మకాం మార్చేసిన శ్రీ రెడ్డి

హైద్రాబాద్, ఆగస్టు 22, (way2newstv.com)
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో తెలుగు సినీ పరిశ్రమను వణికించిన శ్రీరెడ్డి.. హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పి, చెన్నైలోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది. సినిమాల్లో స్థానిక అమ్మాయిలకూ అవకాశాలు కల్పించాలని, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలనే ఆమె పోరాటం.. ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందో తెలిసిందే. ఆ తర్వాత ఆమె తమిళ సినీ పరిశ్రమపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. కొరియోగ్రాఫర్, హీరో లారెన్స్, దర్శకులు సుందర్.సి, మురుగదాస్‌లను లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేసింది. ఆమెపై కోలీవుడ్ గుర్రుగా ఉన్నా.. ఆమె అక్కడ సినిమాల్లో అవకాశం కల్పించడం విశేషం. శ్రీరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘రెడ్డీ డైరీ’ అనే తమిళ చిత్రంలో తన పాత్రలో తానే నటించనుంది. ఈ చిత్రానికి చిట్టిరాయ్ సెల్వాన్, రవిదేవన్‌లు నిర్మాతలు.తాను హైదరాబాద్ విడిచి చెన్నైలోనే స్థిరపడనున్నానని తెలిపింది. దీనిపై ఓ ఇంగ్లీష్ పత్రిక వెబ్‌సైట్ ఆమను సంప్రదించగా.. ‘‘తెలంగాణలో తనకు భద్రతలేదని, అక్కడ జంతువులతో కలిసి జీవించలేనని ఆమె వ్యాఖ్యానించింది. తెలుగు సినీ పరిశ్రమ కొన్ని కుటుంబాల చెప్పుచేతల్లో ఉంది. ‘మా’ నుంచి నాకు ఎలాంటి న్యాయం జరగదని అర్ధమైంది. హైదరాబాదులో నా ప్రాణాలకు హాని ఉంది’’ అని పేర్కొంది. చెన్నైకి మకాం మార్చేసిన శ్రీ రెడ్డి