సెర్ప్ ఉద్యోగుల డిమాండ్ల‌పై ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయండి అధికారుల‌తో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పారిశుద్ధ్య కార్మికులు, జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల నియామక ప్ర‌క్రియ‌పై స‌మీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సెర్ప్ ఉద్యోగుల డిమాండ్ల‌పై ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయండి అధికారుల‌తో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పారిశుద్ధ్య కార్మికులు, జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల నియామక ప్ర‌క్రియ‌పై స‌మీక్ష

హైదరాబాద్, ఆగష్టు 28 (way2newstv.com)
సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లపై తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శాఖాపరమైన పలు అంశాలపై అధికారులతో సోమవారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా సెర్ప్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లతో పాటు...జూనియర్ గ్రామ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితర అంశాలపై ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమి బసులతో చర్చించారు. వెయ్యి, 750 రూపాయల చొప్పున ఎల్ 1, ఎల్ 2 లకు ఇవ్వాల్సిన  పెండింగ్ ఇంక్రిమెంట్ ను ఉద్యోగుల వేతనంతో కలిపేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐదేళ్లకు ఒకసారి ఒప్పందం పునరుద్దరించుకునేలా ఉన్న నిబంధనను కూడా తొలిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే ఇతర డిమాండ్లపైనా అధికారులతోనూ, సెర్ప్ సిబ్బందితోనూ చర్చించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి, సీఈఓలను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిమాయకానికి సంబంధించిన నియమ నిబంధనలు, నోటిఫికేషన్ జారీకి సంబంధించి జరుగుతున్న కసరత్తుపై కమిషనర్ నీతూప్రసాద్తో చర్చించారు. జోనల్ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వగానే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి సంబంధించి కసరత్తు పూర్తి కావచ్చిందని... విద్యార్హతగా ఏడవ తరగతిని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్రెడ్డి, సెర్ప్ హెచ్ ఆర్ డైరెక్టర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ ఉద్యోగుల డిమాండ్ల‌పై ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయండి
అధికారుల‌తో పంచాయ‌తీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
పారిశుద్ధ్య కార్మికులు, జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల నియామక ప్ర‌క్రియ‌పై స‌మీక్ష