అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూలులో మంత్రి జోగు రామన్న - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూలులో మంత్రి జోగు రామన్న

అదిలాబాద్, సెప్టెంబర్ 4, (way2newstv.com)
ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని స్పోర్ట్స్ స్కూల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జోగు రామన్న మంగళవారం నాడు పలు కార్యక్రమాలకు  ప్రారంభోత్సవాలు జరిపారు. స్టేడియంలో  నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను,  ఫ్లయింగ్  రోప్ లను అయన  ప్రారంభించారు.  స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. స్పోర్ట్స్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును మంత్రి ప్రారంభించారు. స్పోర్ట్ స్కూల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతులపై ఆరా తీసిన మంత్రి జోగురామన్న  విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన డార్మెంట్రీతో పాటు వంట గదులను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని రుచి చూసారు. తమ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సైతం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్న మంత్రి  తెలంగాణ నుండి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు గుర్తింపు సాధించారని గుర్తు చేసారు.  రాబోయో  రోజుల్లో ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ నుండి సైతం విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మంత్రి  ఆకాంక్షించారు.
 
 
 
 అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూలులో మంత్రి జోగు రామన్న