లేడీ గబ్బర్ సింగ్ కొత్త రికార్డులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లేడీ గబ్బర్ సింగ్ కొత్త రికార్డులు

హైద్రాబాద్, సెప్టెంబర్ 4(way2newstv.com) 
పూనమ్ పాండే...ఈ పేరు చెబితే చాలు సోషల్ మీడియా షేక్‌ అవుతుంది. తక్కువ సినిమాలు చేసినా హాట్ పోటో షూట్స్, ఘాటు వ్యాఖ్యలతో ఎప్పడూ వార్తల్లో ఉంటుంది ఈ గ్లామరస్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఓ సినిమా చేస్తుంది. హిందీలో కొన్ని సినిమాలతో పాటుగా 'మిస్ మాలిని & కొ' అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. సినిమాలే కాకుండా హాట్ ఫోటో షూట్లతో - ఘాటు వీడియోలతో నెటిజనులకు నిద్ర లేకుండా చేయడంలో ఆమెకు ఆమే సాటి.  తాజాగా పూనమ్ తన రెండో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కు పూనమ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా తన  తాజా చిత్రం టైటిల్ 'లేడీ గబ్బర్ సింగ్' అని తెలుపుతూ ఆ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సర్ కు అంకితం ఇస్తున్నానని ప్రకటించింది.అంతే కాదు తాను  పవన్ కళ్యాణ్ సర్ చేసిన దాన్లో 1% లేడీ గబ్బర్ సింగ్ లో చేయగలిగినా అయన వీరాభిమానిగా చాలా సంతోషిస్తానని చెప్పుకొచ్చింది. దీంతో పవన్‌ ఫ్యాన్ప్ అమ్మడికి బెస్టె విషెస్ చెప్పేశారు.  ఇదే కాదు పూనమ్ రీసెంట్ గా ఈ సినిమా రెమ్యునరేషన్ అంతా కేరళ వరద బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ప్రకటించి అందరి ప్రశంసలు చూరగొంది.  హాట్ బ్యూటీ పూనమ్ కైండ్ హార్ట్‌నెస్ చూసి అమ్మడి అభిమానులు తెగమురిసిపోతున్నారు.
 
 
 
లేడీ గబ్బర్ సింగ్ కొత్త రికార్డులు