రంగారెడ్డి, ఫిబ్రవరి 28, (waya2newstv.com)
హెచ్‌ఎండిఎ విస్తరిత ప్రాంతంలోని చెరువులకు మహార్దశ రానున్నది. అథారిటీ పరిధిలో మొత్తం చెరువులు 4235లుగా ఉన్నాయి. ఇందులో పాతవి 2857 కాగా కొత్తగా గుర్తించినవి 1378లు. అయితే, ఈ చెరువులను ఔటర్ రింగ్ రోడ్‌కు లోపలివైపు, ఔటర్‌కు వెలుపలి వైపు అనే రెండు విభాగాలుగా వేరుచేసింది. ఔటర్‌లోపలి వైపున 455, ఔటర్ వెలుపలి వైపున 2857 చెరువులున్నాయి. హెచ్‌ఎండిఎ ముందుగా విస్తీర్ణంను, వాటి చరిత్రను పరిగణలోకి తీసుకుని ప్రయోగాత్మకంగా సుందరీకరించే వాటి జాబితాను రూపొందించి టెండర్లకు వెళ్ళాలని నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను పిలిచేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. గత జనవరి 31వ తేదీన అథారిటీ అధికారులతో పురపాలక ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండిఎ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న అరవింద్‌కుమార్ ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అథారిటీ ఇటీవల చేపట్టిన, ప్రతిపాదిత పథకాలు, భూములు, వ్యాపార సముదాయాలు, ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు పనులు, బిపిపిఎ చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు వంటి విషయాలపై ప్రత్యేకంగా నివేదికలను రూపొందించి అందించాలని కమిషనర్ అరవింద్‌కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
సిటీలో 4325 చెరువులకు కొత్త కళ
దీంతో సంస్థ పలు విభాగాల ఉన్నతస్థాయి అధికారులు నివేదికను రూపొందించడంపై దృష్టిసారించారు. ప్రధానంగా అథారిటీ విస్తరిత ప్రాంతంలోని చెరువులను సుందరీకరించేందుకు టెండర్లను పిలవాలని భావిస్తున్నది.సంస్థ పరిధిలో పూదోటలు, పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అందుకు పూదోటలు, పర్యావరణం అభివృద్ధి పరచడంలో అనుభవజ్ఞులైన, నిపుణులైన ఇంజనీర్లను, ఆర్కిటెక్చర్‌లను పత్రికా ప్రకటనలను వెలువరించి, ఆసక్తి ఉన్నవారిని ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. వీరిని తీసుకుని నూతన నమూనాలతో పూదోటలను, ఉద్యానవనాలను, పర్యావరణం కోసం పచ్చదనాన్ని పెంపొందించే ప్రణాళికలను సిద్దంచేయాలని కమిషనర్ సూచించారు. ఈ మేరకు ఇంజనీరింగ్ అధికారులందరూ వాటిని గుర్తించడం, టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు, అందుకునుగుణంగా అనుసరించే పద్దతులతో కూడిని నివేదికను సిద్దం చేయడంలో నిమగ్నమయ్యారు.భూసమీకరణ పథకం అమలు చేసేందుకు సమగ్రమైన నోట్‌ను సిద్దం చేయాలని సూచించారు. ప్రస్తుతం బిపిపిఎ పరిధిలో ఇప్పటివరకు నిర్వహిస్తున్న కార్యకలాపాలతో కూడిని నివేదికను వెంటనే అందించాలని ఆదేశించారు. సంస్థకు చెందిన వ్యాపార సముదాయాల వద్ద ప్రత్యేకంగా డిజిటల్ బోర్డులను ప్రదర్శనగా ఏర్పాటు చేయాలని, సముదాయాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ అరవింద్‌కుమార్ తెలిపారు. వీటితోపాటు సంస్థకు చెందిన భూములు, ప్లాట్లు ఇతరత్రా విషయాలపైనా నివేదికను సిద్దంచేయాలని అధికారులను ఆయన ఆదేశాలు జారీచేయడంతో ఉన్నతస్థాయి అధికారులు నివేదికలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టిసారించారు
Tags:
telangananews