ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
అమరావతి ఫిబ్రవరి 16 (way2newstv.com)
వీర జవాన్ల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకారమని చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మనిషి ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు అత్యంత హేయమైనవిగా అభివర్ణించారు. ఉగ్రవాదం అణచివేతలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తమ వంతు సహకారం అందించాలని కోరారు.
Tags:
Andrapradeshnews