బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం 69 మంది మృతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం 69 మంది మృతి

ఢాకా, ఫిబ్రవరి 21, (way2newstv.com)
బంగ్లాదేశ్ లో గురువారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో 69 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 50 మంది గాయాల పాలయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకా నగరంలోని పాత చౌక్ బజార్ లోని హజీ వాహిద్ మాన్షన్ భవనంలో అగ్నికీలలు రేగాయి. ఈ భవనంలో చాలా మటుకు రసాయనాలను భద్రపరిచారు.


బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం 69 మంది మృతి

భద్రతా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పాత భవనం కావడంతో అగ్ని ప్రమాదంలో ఎక్కువ మంది మరణించారు.మంటలు పక్క భవనాలకు కుడా వ్యాపించడంతో అధికారులు మరింత శ్రమపడ్డారు.  మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. తాము ఇప్పటివరకు 69 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని బంగ్లాదేశ్ అగ్నిమాపక శాఖ సంచాలకులు జుల్ఫికర్ రహమాన్ చెప్పారు. ఈ ఘటనలొ దాదాపు 45 గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా వుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించామని ఆయన వివరించారు. అగ్నిప్రమాదానికి కారణాలేమిటనేది ఇంకా తేలలేదు.