గడ్చిరోలి, ఫిబ్రవరి 28 (way2newstv.com)
మహారాష్ట్ర అడవిలో మళ్లీ రక్తం పారింది. బందూకులు గర్జించాయి.. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి సవేగామ్ అటవీప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 8 మంది మావోలు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు ఏ రాష్ట్రానికి చెందిన వారే అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మావోలు ప్రతికారేచ్ఛకు పాల్పడే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు సవేగామ్ అటవీప్రాంతంలో మావోల కోసం జల్లడ పడుతున్నారు. జిల్లా సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అటు పోలీసులు, ఇటు మావోల దాడులతో ప్రజలు ఉల్లిక్కిపడుతున్నారు.
గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్.. 8 మంది మావోలు మృతి
ఇదే జిల్లాలో బోరియా అటవీ ప్రాంతంలో గత ఏడాది ఏప్రిల్లో కూడా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 41 మంది మావోలు మృతి చెందారు. మృతుల్లో శ్రీను అలియాస్ శ్రీకాంత్ అలియాస్ విజేందర్(41), సాయినాథ్(34)గా గుర్తించారు. జిల్లాలో ఒకే ఎన్కౌంటర్లో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడం, వీరిలో ఇద్దరు డివిజినల్ కమాండర్లు ఉండడం ఇదే తొలిసారి. విజేందర్ను జయశంకర్ జిల్లా చల్లగరిగెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 తుపాకులతో పాటు భారీఎత్తున పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Tags:
all india news