సింగూరులో తగ్గుతున్న నీటి మట్టం

మెదక్, ఫిబ్రవరి 8, (way2newstv.com) 
వేసవి సమీపిస్తుంది. తాగునీటి ఎద్దడి ముంచుకొస్తుంది. ఉమ్మడి జిల్లా మెదక్‌తో పాటు పొరుగు ఉమ్మడి జిల్లా నిజామాబాద్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దాహం తీరుస్తున్న సింగూరు నీటి మట్టం క్రమంగా తగ్గుతూ కలవరపెడుతుంది.అడుగంటుతున్న సింగూరు జలాశయం తీరు ప్రజలు, అధికారుల్లో ఆందోళన పెంచుతుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న పద్దతినే కొనసాగిస్తే ఏప్రిల్ మొదటి వారంలోనే పూర్తిగా ఎండిపోయే ప్రమాదకర పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నడి వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఇక్కట్లు పడాల్సి రావచ్చు.అంత జఠిల సమస్య ఎదురవకుండా ముందు జాగ్రత్తలు అధికారులు తగిన చర్యలు తీసుకోనున్నారు. ఉన్న కాస్త జలాలను పొదుపుగా వాడుకొనే ఆంశమై దృష్టి సారించారు. మంజీరా బ్యారేజీ నుంచి హైదరాబాద్ మహానగర అవసరాలకు నీటిని తీసుకెళ్లకుండా చూసేలా ఇప్పటికే చర్యలు ప్రారంభించారు.మరో వైపు ఉమ్మడి  జిల్లా సంగారెడ్డి, మెదక్‌తో పాటు పొరుగు జిల్లా అయిన కామారెడ్డిలోని ఆవసరాలకు మీషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు అందిస్తున్న నీటి పరిణామాన్ని తగ్గించి ఇచ్చే అంశమై సమాలోచనలు చేస్తున్నారు. 


సింగూరులో తగ్గుతున్న నీటి మట్టం

ఇందు కోసం ఫిబ్రవరి 2 శనివారం రోజున సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో వివిధ విభాగాల అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.సింగూరు జలాశయం పూర్తి సామర్థ్యం 29.91 టీఎంసీలు, అందులో ప్రస్తుతం కేవలం 1.784 టీఎంసీల మేర మాత్రమే నీరుంది. అందులో నుంచే ప్రతి రోజు 100 క్యూసెక్కులను మీషన్ భగీరథ పథకంలో భాగంగా వాడేస్తున్నారు. నిత్యం 35 క్యూసెక్కుల మేర ఆవిరి నష్టాలు ఉంటాయి. ఓడీఎఫ్, బీడీఎల్‌ల కోసం ఇక్కడి నుంచి రోజు 30 క్యూసెక్కులు తీసుకెలుతున్నారు.దిగువన ఉన్న మంజీరా బ్యారేజీలో ప్రస్తుతం 0.25టీఎంసీల నీళ్లున్నాయి. ఇక్కడి నుంచే సంగారెడ్డి పురపాలక సంఘంతో పాటు నర్సాపూర్ నియోజకవర్గానికి నీళ్లందిస్తున్నారు. దీనికితోడు నిత్యం 150ఎంఎల్‌డీ జలాలను హైదరాబాద్ మహానగర అవసరాల కోసం తరలిస్తున్నారు.ఇదే విధానం ఇలాగే కొనసాగితే అధికారుల అంచనా ప్రకారం ఏప్రిల్ మొదటి వారం వరకే సంగారెడ్డి, మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వాసులకు తాగునీటిని సరఫరా చేయగలుగుతారు. వేసవి విజృంభిస్తున్న సమయంలోనే నీటికి కటకట ఏర్పడుతుంది. మండు వేసవిలో నీళ్ల కోసం తిప్పలు పడాల్సిన దుస్థితి తలెత్తుతుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలలోని నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి జిల్లా జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గాలకు మంజీరా నది ఆధారంగానే మీషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో సింగూరులో నీటిమట్టం 1.784 టీఎంసీలకు చేరడంతో మున్ముందు తాగునీటి కష్టాలు ఎదురవకుండా అధికారులు చర్యలు ప్రారంభించారు.ఇప్పటికైతే ప్రతిరోజు వంద క్యూసెక్కుల నీటిని మీషన్ భగీరథ కోసం తీసుకుంటున్నారు. ఇందులో సగం మేర పంపిణీని తగ్గించుకుంటే ఇబ్బందులను కొంతమేరకు ఎదుర్కొవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు విన్నవించారు. ఇప్పుడు తీసుకుంటున్నట్లుగా రోజు వంద క్యూసెక్కులను బదులుగా 50 క్యూసెక్కుల నీటిని మాత్రమే వాడుకుంటే జాన్ వరకు తాగునీటికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదనేది వారి అంచనా
Previous Post Next Post