సర్పంచ్ లు పంచాయతీ రాజ్ చట్టం పై అవగాహన పెంచుకోవాలి

కలెక్టర్ కృష్ణభాస్కర్ 
సిద్దిపేట, ఫిబ్రవరి 25 (way2newstv.com)
నూతన పంచాయతీ రాజ్ చట్టం పై సిద్దిపేట జిల్లాలో రెండవ విడత గా జిల్లాలోని సిద్దిపేట , సిద్దిపేట అర్బన్ , చేర్యాల, నంగునూర్ , మిరుదొడ్డి , మద్దూర్ మండలాలకు చెందిన గ్రామాల  సర్పంచ్ లకు  శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కొండపాక లోని మెదక్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ డిపిఓ సురేష్ బాబు తో కలిసి  ప్రారంభించారు.  


సర్పంచ్ లు పంచాయతీ రాజ్ చట్టం పై అవగాహన పెంచుకోవాలి

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు నుండి మార్చ్ 1 వరకు ఈ యొక్క శిక్షణ కార్యక్రంమం రెసిడెన్షియల్ మోడ్ లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త చట్టంలో పలు కీలక మార్పులు జరిగాయని వాటిని సర్పంచ్ లు అందరు అవగాహన చేసుకొని , గ్రామ అభివృద్దకి తోడ్పడాలని పిలుపునిచ్చారు . ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి 100 సంవత్సరాలు గ్రామ ప్రజలు గుర్తుంచుకునేల ఉండాలని ఆయన అన్నారు, ఈ శిక్షన కార్యక్రమంలో ఎంపిడిఓ లు , సిఓపిఆర్ అర్డిలు , గజిటెడ్ హెడ్ మాస్టర్స్ , ఎన్జీఓలు ఆర్గనైజర్స్ శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6గంటల  వరకు శిక్షణ కార్యక్రమాలు, 6నుండి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని తెలిపారు , ఈ కార్యక్రమలో  సమ్మిరెడ్డి ,వెంకటేశ్వర రెడ్డి , భిక్షపతి , రమేష్ రావు , శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post