హైదరాబాద్,ఫిబ్రవరి 8 (way2newstv.com)
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సుల ఆందోళన రెండవ రోజుకు చేరింది. మూడు నెలలుగా పెండింగ్ లో వున్న వేతనాలు చెల్లించాలని నర్సులు ధర్నా చేస్తున్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సూపరిండెంట్ కార్యాలయం ముందు రోజు రెండు గంటల చొప్పున బైటాయిస్తున్నారు.
ధర్నా చేస్తున్న 200మంది నర్సులు తమ విధులను నిర్వహిస్తూనే, రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉదయం 8గంటల నుండి 10గంటల వరకు రోజు 2గంటల పాటు శాంతి యుతంగా ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి తమ వేతనాలు తమకు ఇప్పించాలని కోరుతున్నారు. న్యాయమైన తమ డిమాండ్ ను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Tags:
telangananews