విజయనగరం లో రోడ్డు ప్రమాదం

విజయనగరం, ఫిబ్రవరి 19, (way2newstv.com
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొట్లాం గ్రామ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు.


విజయనగరం లో రోడ్డు ప్రమాదం 

మరో 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  విజయనగరం నుంచి గజపతి నగరం వైపు వెళ్తున్న సాలూరు ఆర్టీసీ బస్సు, అదేమార్గంలో ఎదురుగా గజపతినగరం నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ ఢీకొంది. అతివేగంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. మరో 20 మంది వరకు ప్రయాణి కులు ఇదే బస్సులో ఉండగా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Previous Post Next Post