మార్కెట్లో అంగన్ వాడీ పోస్టులు...

కడప,ఫబ్రవరి 26, (way2newstv.com)
కడప జిల్లాలోని పట్టణస్థాయిలో, గ్రామస్థాయిలో ఖాళీలు ఏర్పడిన అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులన్నీ రాజకీయ మార్కెట్‌లో ముందుగానే అమ్మకమైపోయాయి. ఇంటర్వ్యూలను కూడా వీలైనంత వరకు మీడియాకు తెలియనీయకుండా, జాగ్రత్తపడి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు అక్కడ మీడియాకు ఎదురైన సమాధానాలు బట్టి అర్థమైంది. అధికారపార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జి నేతలు చెప్పిన వారికి ముందుగానే ఈపోస్టులు ఖరారైనట్లు బహిరంగంగానే అక్కడ ప్రచారం జరిగింది. ఒక పోస్టుకై ఓ మహిళ తమ కుటుంబ బాధలు చెబుతూ, తాను అన్ని విధాల అర్హురాలినని చెబుతుండగా, ఓ అధికారి తామేమీ చేయలేమని ఆ నియోజకవర్గ తెలుగుదేశం నేత చెప్పిన వారికి ఇవ్వకపోతే కలెక్టరేట్‌లో రచ్చచేస్తారని సముదాయించి చెబుతుండటం బహిరంగంగానే జరిగింది.  


 మార్కెట్లో అంగన్ వాడీ పోస్టులు...


ఇంటర్వ్యూలు జరిగిన విషయాన్ని ధృవీకరించుకుని తిరిగి సమాచారం అడుగగా, తాను ఆలస్యంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యానని, డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీ, ఇతర అధికారులు ఇంటర్వ్యూలు చేస్తుండగా తాను మద్యలో కలిశానని సమాధానం ఇచ్చారు. ఇంటర్వ్యూలు పారదర్శకంగానే జరిపి మెరిట్ ప్రాతిపదికన నోటిఫికేషన్‌లో పొందుపరచిన నియమ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు ఆమె తెలిపారు. కాగా జిల్లాలో 297 మినీ అంగన్వాడీ ఉద్యోగాలకు ,41 అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలకు, 290 ఆయాల పోస్టులకు  అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పోస్టులన్నీ నియమ నిబంధనలకు విరుద్ధంగానే అనర్హులకు పంచినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు స్థానికంగా నివసించే మహిళలు మాత్రమే అర్హులు. వారికి వివాహం అయి, కనీసం ఒకరు సంతానం కలిగివుండాలి. అయితే ఈనిబంధనలేమీ పాటించకుండా స్థానికేతరులకు, పెళ్లికాని వారికి కూడా కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ముందుగానే ఆయా నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జి నేతలు చెప్పినట్లుగా ఖరారైనట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల శైలి కూడా దీన్ని బలపరిచేదిగానే కనిపించింది. ఎన్నికల సమయంలో ఖాళీలైన ఈ ఉద్యోగాల భర్తీని రాజకీయ నాయకులు సొమ్ముచేసుకున్నారు. ఒక్కొక్క ఉద్యోగానికి ఆయా ఉద్యోగాలను బట్టి రూ.2లక్షల నుండి రూ.4లక్షల వరకు మార్కెట్‌లో అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ డబ్బు తీసుకుని వారి నాయకుడి ద్వారా తమకు పోస్టు ఖరారు చేసినట్లు ఇంటర్వ్యూ వద్దే ఓ మహిళ చెప్పడం విశేషం. దీన్నిబట్టి చూస్తే జిల్లావ్యాప్తంగా ఉన్న ఈపోస్టులన్నీ ఎన్నికల సమయంలో అధికారపార్టీ నాయకులకు సొమ్ముచేసుకునేందుకు ఉపయోగపడ్డాయని స్పష్టవౌతోంది. రెండురోజుల క్రితం సర్వశిక్ష అభియాన్‌లో భర్తీ చేసిన 12 స్పెషలాఫీసర్ ఉద్యోగాలను కూడా రాజకీయ జోక్యంతోనే భర్తీ చేసినట్లువిశ్వసనీయ సమాచారం. కాగా జిల్లాలో 97ఏఎన్‌ఎం పోస్టులు, 46 స్ట్ఫా నర్సు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు స్క్రూట్నీ ప్రక్రియ జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు వీటిని కూడా భర్తీ చేయాలని, పై నుండివస్తున్న రాజకీయ వత్తిడితో అధికారులు పరుగులు పెడుతున్నారు.
Previous Post Next Post