సిద్దిపేట, ఫిబ్రవరి 28 (way2newstv.com)
సిద్దిపేటలో విషాదం చోటుచేసుకుంది. రంగనాయక సాగర్ వద్ద ప్రాజెక్ట్ పనులు పరిశీలిస్తున్న విద్యార్థులపైకి ఓ వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని సహా కార్మికుడు మృతిచెందారు. రంగనాయక సాగర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వెళ్లారు.
సిద్దిపేటలో విషాదం..ఇద్దరు మృతి
ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చూస్తుండగా టెన్నల్లో ఓ వాహనం బ్రేకులు ఫెయిలై విద్యార్థులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని నాగలక్ష్మీ, అక్రమ్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి, క్షతగాత్రులను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి
Tags:
telangananews