హైద్రాబాద్, ఫిబ్రవరి 25 (way2newstv.com)
మహిళలను తాము నిర్లక్ష్యం చేయడం లేదని, రానున్న రోజుల్లో ఇద్దరు మహిళలను కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. . మహిళలకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి కోరారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానమిస్తూ… మహిళలకు తామేమీ వ్యతిరేకం కాదని, నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీల్లో కూడా మహిళలకు ఒక సీటు ఇచ్చామన్నారు. మహిళలను తాము నిర్లక్ష్యం చేయమని, వారి పట్ల తమకు చాలా గౌరవం ఉందన్నారు.తెలంగాణ సిఎం కెసిఆర్ మైండ్ గేమ్ ముందు కాంగ్రెస్ మరోసారి తేలిపోయింది. క్యాబినెట్ లో మహిళలకు స్థానం ఎందుకు ఇవ్వడం లేదంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అసెంబ్లీలో నిలదీయడాన్ని అవకాశంగా మలచుకున్నారు కెసిఆర్. ఎందుకు ఇవ్వం ఇస్తాం. మాకు మహిళలంటే మహా గౌరవం అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఇద్దరు మహిళలకు నెక్స్ట్ క్యాబినెట్ లో బెర్త్ లు ఖాయమని చెప్పేశారు.
ఆ ఇద్దరి మహిళా మంత్రులుఎవరు...
ఇక్కడి వరకు బాగానే వున్నా ఆ ఇద్దరు స్వపక్షమా విపక్షమా అన్నది అర్ధం కాక కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైపోయింది ఇప్పుడు.ఆపరేషన్ ఆకర్ష్ లో కెసిఆర్ అందెవేసిన చెయ్యి. గత ఎన్నికల్లో గెలిచాకా ఆయన అన్ని రకాలా విపక్ష అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి గులాబీ కండువా కప్పేశారు. మంత్రి పదవులు వారికి కట్టబెట్టారు. ఆయన వ్యూహంతోనే టిడిపి తెలంగాణ లో ముఖ్యంగా అడ్రెస్ గల్లంతు అయ్యే పరిస్థితికి వచ్చేసింది. తరువాత ఎన్నికల్లో రెండు స్థానాలతో సరిపెట్టుకున్నా వారుకూడా వుంటారో లేదో చెప్పలేని వాతావరణం కొనసాగుతుంది. ఇక తాజాగా కాంగ్రెస్ పై గురిపెట్టారు గులాబీ బాస్. వారి సంఖ్యా బలాన్ని మరింత దెబ్బ కొట్టే వ్యూహనికి పదును పెట్టె క్రమంలోనే క్యాబినెట్ ఏర్పాటు ఆలస్యం అయ్యిందన్న టాక్ నడుస్తుంది. మరోపక్క పరిమిత సంఖ్యలో మంత్రుల టీం ప్రకటించి పక్క పార్టీలనుంచి వచ్చే వారికి ఆఫర్ సిద్ధం చేశారు ఆయన. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్యెల్యేల కోసం రెండు బెర్త్ లు రెడీ చేసినట్లు ప్రచారం నడుస్తుందిఅభద్రతా భావంతో వున్న కాంగ్రెస్ కి కెసిఆర్ కామెంట్స్ టెన్షన్ పుట్టించాయి. హస్తం పార్టీపై గత అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు గెలిచారు. వారిలో సీనియర్ లు అయిన సీతక్క, సబితా ఇంద్రా రెడ్డి వంటివారు వున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వీరి కదలికలపై ఒక కన్నేసే ప్రయత్నం ఇక నుంచి మొదలు పెట్టనుంది. టిఆర్ఎస్ నుంచి ముగ్గురు మహిళలు గెలిచినా వారిలో ఇద్దరు సీనియర్లు వున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి అదృష్టం దక్కుతుందన్నది ఆయన మరోసారి విస్తరణ చేసే వరకు రహస్యమే అంటున్నాయి గులాబీ శ్రేణులు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యాకా లెక్కలు తేలనున్నాయి. ఆ తరువాత పూర్తి స్థాయి క్యాబినెట్ ను కెసిఆర్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అప్పటివరకు కాంగ్రెస్ కి టెన్షన్ తప్పేలా మాత్రం కనిపించడం లేదు.
Tags:
telangananews