యూట్యబ్ లో వైరల్ అవుతున్న ఓరియా టైలర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యూట్యబ్ లో వైరల్ అవుతున్న ఓరియా టైలర్

 పాట్నా, ఫిబ్రవరి 9 (way2newstv.com
తమిళ బిగ్ బాస్‌ సంచలనం ఓవియా నటించిన 90 ఎంల్ మూవీ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. హాట్ అండ్ బోల్డ్ కంటెంట్‌తో పెద్దలకు మాత్రమే.. అని ముందుగానే హెచ్చరించి ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 110 సెకన్ల ట్రైలర్‌ను త్తెక్కించే సీన్లతో నింపేశారు. కుర్రాళ్లకు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉండటంతో.. 90 ఎంఎల్ ట్రైలర్ ఒక్క రాత్రిలోనే 8 లక్షలకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. 


యూట్యబ్ లో వైరల్ అవుతున్న ఓరియా టైలర్

శనివారం ఉదయానికి వన్ మిలియన్ వ్యూస్ రాబట్టింది. విమెన్ సెంట్రిక్ మూవీగా 90 ఎంఎల‌్‌ను ప్రమోట్ చేశారు. కానీ ట్రైలర్ చూశాక అందరికీ దిమ్మతిరిగినంత పనైంది. ఓవియా ఇలాంటి సినిమా చేయడం ఏంటి? కోలీవుడ్ పరువు తీస్తున్నారంటూ మండిపడ్డారు. సెక్స్, ఆల్కహాల్.. ఇలాంటి కంటెంట్‌తో సినిమానా అని విమర్శిస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. ఓవియా, బొమ్ము, మసూమ్, శ్రీ గోపిక, మొనీషా, అన్సన్ పాల్, తేజ్ రాజ్ ప్రధాన పాత్రో నటించారు. ఈ విమర్శలకు ఓవియా సమాధానం ఇచ్చింది. పండు రుచి చూసే ముందు గింజను చూసి ఓ నిర్ణయానికి రావొద్దు. సినిమా కోసం వెయిట్ చేయండని ట్వీట్ చేసింది. బిగ్ బాస్ తొలి సీజన్ విజేతగా నిలిచిన ఓవియాకు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతో మంది అమ్మాయిలకు తను స్ఫూర్తినిచ్చింది. ఓవియా ఆర్మీ పేరిట ఓ ఆర్మీనే ఏర్పాటైంది.