హైదరాబాద్, ఫిబ్రవరి 28 (way2newstv.com)
ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా చెల్లింపుల విషయమై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలను నెల వారి లేదా త్రైమాసిక నివేదికలు పొందేలా డాటాబెస్ లో అవకాశం ఊండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి కేంద్ర అధికారులను కోరారు. గురువారం సచివాలయంలో కేంద్ర ఎరువుల శాఖ అడిషనల్ సెక్రటరీ ధరమ్ పాల్, తమ శాఖ అధికారులతో ఎరువుల ప్రత్యక్ష నగదు బదిలి అమలు పై సి.యస్ సమక్షంలో సమీక్షించారు.
నగదు బదిలీలపై సమీక్ష
సి.యస్ డా.ఎస్.కె.జోషి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 5వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉన్నారని, ఒక్కొక్కొరు దాదాపు 2000 మంది రైతులకు సేవలందిస్తున్నారని, 58 లక్షల మంది రైతుల భూ వివరాలు ఉన్నాయని వారికి తెలిపారు. రైతుల వివరాలను ఫర్టిలైజర్ దీబీటీ లో వినియోగించే విషయాన్ని ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల సబ్సిడీ రిటైలర్స్ ప్రత్యక్ష నగదు బదిలి అమలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పో పోస్ ద్వారానే ఎరువుల అమ్మకానికి కృషి చేస్తున్నామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండ అవసరమైన స్టాకును నియంత్రిస్తున్నామయని అన్నారు.
కేంద్ర అదనపు కార్యదర్శి ధరమ్ పాల్ మాట్లాడుతూ ఎరువుల సబ్సిడీ ప్రత్యక్ష నగదు బదిలిని వ్యవసాయశాఖ, కలెక్టర్లు నిత్యం పర్యవేక్షించేలా డాష్ బోర్డు ను రూపొందించామని తెలిపారు. నాణ్యతతో కూడిన ఎరువులు రైతులకు చేరేలా చూస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ కార్యదర్శి రాజశేఖర్, పరిశ్రమల శాఖ కమీషనర్ నదీమ్ అహ్మద్, వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా, కేంద్ర ఎరువుల శాఖ డైరెక్టర్ జి.కవిత లతో పాటు ఎరువుల కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
telangananews