మార్కెట్లో థీమ్డ్, డిజైనర్ లైటింగ్

హైద్రాబాద్, ఫిబ్రవరి 27, (way2newstv.com)
గృహాలాంకరణ నవీన పుంతలు తొక్కుతున్నది. ఇంటిని కాంతీ వంతం చేయడంలో నగరవాసులు కొత్తాందాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే థీమ్డ్, డిజైనర్ లైటింగ్ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు స్టార్ హోటళ్లు, బడా బంగళాలకే పరిమితమైన ఈ కాంతులు ప్రస్తుతం సామాన్యుల ఇండ్లలోనూ కనువిందు చేస్తున్నాయి. మాస్టర్‌బెడ్‌రూం, కిడ్స్ రూం, గెస్ట్ రూం, కిచెన్ ఇలా ఏ గదికి అనుకూలమైన రీతిలో రకరకాల డిజైన్లతో లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ప్రతి ఇంట్లో హాలుకు ప్రత్యేక ఆకర్షణ రావాలంటే షాండ్లియర్ తప్పనిసరి. రంగురంగుల క్రిస్టల్స్‌తో విభిన్న ఆకృతుల్లో షాండ్లియర్‌లు తయారవుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్నచిన్న ఎల్‌ఈడీ బల్బుల ఆధారంగా షాండ్లియర్‌లను రూపొందిస్తున్నారు. 


మార్కెట్లో థీమ్డ్, డిజైనర్ లైటింగ్

దీంతో విద్యుత్ ఆదాతో పాటు ఎక్కువ వెలుగు, కొత్తదనం సంతరించుకుంటున్నది. ఏడు నుంచి పది అడుగుల ఎత్తు వరకు ఈ షాండ్లియర్‌లు లభిస్తున్నాయి.పిల్లల పడకగదిలో థీమ్డ్ లైంటింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నది. జంతువులు, సంగీత వాయిద్యాలు, బొమ్మలు, క్రీడోపకరణాలు ఇతరాత్ర ఆకృతుల్లో లైటింగ్ సందడి చేస్తున్నది. లైటింగ్ అద్భుతంగా ఉండడం వల్ల ఆ గదికి పిల్లలు ఆకర్షితులవుతారు. అక్కడే చదువుకోవడానికి, ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు.ఇంట్లో ఫ్యాన్, లైట్ ఏది లేకున్నా కష్టమే. ఈ క్రమంలో ఫ్యాన్ కమ్ లైట్ ఉత్పత్తులు తెరమీదికి వచ్చాయి. మూడు రెక్కలు మొదలుకొని ఐదు రెక్కల ఫ్యాన్‌తో పాటు దానికే చిన్నపాటి షాండ్లియర్‌తో కూడిన ఉత్పత్తులు సందడి చేస్తున్నాయి. వీటితో ఏక కాలంలో గాలీ, వెలుతురు గదిని ఆక్రమిస్తున్నాయి.థీమ్డ్, డిజైనర్ లైటింగ్ సరికొత్త రూపాల్లో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చెట్టుకు కాసిన పండ్లు, వేలాడే తిరగలి చక్రం, ప్రొక్లెయినర్, రాకెట్, ఐఫిల్ టవర్, గీటార్, కుర్చీ, జంతువులు, పక్షులు, చెట్లు, పువ్వులు, ఆకులు, పుట్టలు, లాంతరు, గవ్వలు, చందమామ, నెమలి పించం, డోలు ఇలా అనేక ఆకృతుల్లో డిజైనర్ లైటింగ్ సందడి చేస్తున్నది.ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీలు థీమ్డ్, డిజైనర్ లైటింగ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. రూ.300 నుంచి మొదలు కొని రూ.10 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. నగరంలోని లైటింగ్ షోరూంలతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్, ఈబే, వూనిక్స్ వంటి అనేక ఆన్‌లైన్ షాపింగ్స్ మార్కెట్‌లోనూ థీమ్డ్, డిజైనర్ లైటింగ్ అందుబాటులో ఉన్నాయి.
Previous Post Next Post