పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వై.యస్ జగన్

గుంటూరు, ఫిబ్రవరి 27(way2newstv.com
ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయ్యాన్ని సర్వమత ప్రార్థనల మధ్య అశేష అభిమానుల సమక్షంలో ప్రారంభించారు. తొలుత కుటుంబ సమేతంగా తాడేపల్లిలో గృహప్రవేశం చేసిన వైఎస్ జగన్.. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన తర్వాత పార్టీ  జెండాను ఆవిష్కరించారు. 

 
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వై.యస్ జగన్

ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి, విజయసాయిరెడ్డి, పార్థసారథిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తరలి రావడంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆ ప్రాంగణమంతా ‘జోహార్ వైఎస్సార్.. జై జగన్’ అనే నినాదాలతో మార్మోగుతుంది.  10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని ఓటుకు కోట్లు కేసుతో వదిలి అమరావతికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఇంత వరకు శాశ్వత భవనం నిర్మించలేదని, తాత్కాలిక భవనాలతోనే కార్యాకలపాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఇళ్లు కట్టుకున్న సీఎం.. ఇప్పటి వరకు అమరావతిలో శాశ్వత భవనాన్ని నిర్మించుకోలేదని, జననేత జగన్ మాత్రం శాశ్వత ఇళ్లు, పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారని వైసిపి నాయకులు తెలిపారు..
Previous Post Next Post