తుగ్గలి, ఫిబ్రవరి 26 (way2newstv.com)
ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న వేళ మండల స్థాయి అధికారులు గ్రామంలో ఓటర్లకు అవగాహనను కల్పిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పగిడిరాయి కొత్తూరు గ్రామంలో వీఆర్వో జయరామిరెడ్డి,పంచాయతీరాజ్ ఏఈ ఇంతియాజ్ బాషా గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పై గ్రామస్తులకు అవగాహన
అదే విధంగా మండల కేంద్రమైన తుగ్గలిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తుగ్గలి విఆర్వో నాగేంద్ర, ప్రధానోపాధ్యాయులు జాకీర్ హుస్సేన్ లు ఓటర్లకు ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వివిపిఏటి) యంత్రంపై అవగాహనను కల్పించారు. మామిళ్ల కుంట గ్రామంలో 111 నెంబర్ పోలింగ్ స్టేషన్ లో మహిళలకు, గ్రామస్తులకు అధికారులు ఈవీఎం లపై అవగాహన కల్పించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులు అన్ని గ్రామాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ పై అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా ఓటర్లు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో విఆర్ఎ లు,పోలీస్ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
telangananews