బాలింత మృతిపై ఆందోళన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాలింత మృతిపై ఆందోళన

ఖమ్మం  ఫిబ్రవరి 25 (way2newstv.com)
బాలింత మృతిపై కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట  ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యమని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.కామేపల్లి మండలం టేకులతండాకు చెందిన గుగులోతు జ్యోతి(23) ఈనెల 22న పురిటినొప్పులతో జడ్పీసెంటర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది. శస్త్రచికిత్స ద్వారా వైద్యురాలు కాన్పు చేయడంతో బాబు పుట్టాడు. ఆ తర్వాత బాలింతకు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో స్పృహ కోల్పోయిన ఆమెను ఈనెల 23న అర్ధరాత్రి మెరుగైన చికిత్స కోసం ఆర్డీవో కార్యాలయం సమీపంలోని మరో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. 


బాలింత మృతిపై ఆందోళన

అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం జ్యోతి మృతిచెందింది. దీంతో కుటుంబీకులు, బంధువులు రెండో ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం బాలింతకు అధిక రక్తస్రావం అయి ప్రాణాపాయ స్థితికి చేరిందని తెలిపారు. సంఘటన సమయంలో రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులతో చర్చించారు. ఆందోళన విరమించాలని లిఖిత ఫిర్యాదు చేస్తే తాము విచారిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మధ్యవర్తుల రాజీ ప్రయత్నాలు ఫలించడంతో వారు శాంతించారు. అనంతరం జ్యోతి భర్త దేవ్‌సింగ్ తన భార్య లోబీపీ కారణంగా మరణించిందని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్ ప్రకటించారు