తెలంగాణలో హరీష్ రావే హాట్ టాపిక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో హరీష్ రావే హాట్ టాపిక్

హైద్రాబాద్, ఫిబ్రవరి 21, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకమైన నేత ఎవరంటే ముందుగా కేసీఆర్ పేరు వినిపిస్తే.. ఆ వెంటనే వినిపించే పేరు హరీష్ రావు. మొదటి నుంచీ కేసీఆర్ కి, టీఆర్ఎస్ పార్టీకి వెన్నంటి ఉంటూ ఎనలేని సేవలందించారు హరీష్. అయితే మొదటి దఫా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఆయనకున్న ప్రయారిటీ.. రెండో దఫా టీఆరెస్ గవర్నమెంట్ లో లేకపోవటం పలు చర్చలకు తావిస్తోంది. ఈ సారి హారీష్ భారీ మెజారిటీతో గెలిచారు కూడా. అయినా కేసీఆర్.. హరీష్ ని పక్కనపెడుతుండటం రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతోంది. అసలెందుకిలా జరుగుతోంది? దీని వెనుక ఏదన్న వ్యూహం ఉందా? లేక తన స్వార్ధం కోసమే కేసీఆర్ ఇలా హరీష్ వంక చూడటం లేదా? అని రకరకాల చర్చలు మొదలయ్యాయి.కిందటి సారి కేసీఆర్ క్యాబినెట్లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావును ఈ సారి క్యాబినెట్ లో తీసుకోకపోవటంలో అర్ధమేంటో తెలియక జనం అయోమయానికి లోనవుతున్నారు. 


తెలంగాణలో హరీష్ రావే హాట్ టాపిక్

నిజానికి తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే హరీష్ ను పక్కన పెడుతున్నారనే ప్రచారం బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన క్యాబినెట్ కూర్పులో కూడా హరీష్ రావుకు చోటు దక్కకపోవడం ఆ ప్రచారాలకు మరింత బలాన్నిచ్చింది. ఇది పూర్తి క్యాబినెట్ విస్తరణ కాకపోవడంతో రెండో దఫాలో హరీష్ రావుకు అవకాశం దక్కుతుందని అనే వారు లేకపోలేదు.ఇక మరోవైపు హరీష్ రావు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారని, హరీష్ రావును వ్యూహాత్మకంగానే పక్కన పెడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తొలి దఫాలో హరీష్ రావుతోపాటు కేటీఆర్ కు కూడా మంత్రి పదవీ దక్కలేదు. కాకపోతే కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను ఇదివరకే కేసీఆర్ అప్పగించారు. కానీ హరీష్ రావు మాత్రం పార్టీ పదవీగానీ, మంత్రి పదవీగానీ ఇవ్వకపోవటం గమనార్హం. ఏదిఏమైనా ఎలాంటి పరిస్థితులైనా చక్కదిద్దే హరీష్ రావుకే ట్రబుల్స్ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే మంత్రి పదవి దక్కకున్నా, తనలోని అసంతృప్తిని ఏమాత్రం బయటపెట్టకుండా చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి హాజరైన హరీశ్.. ఈ రోజు జరిగిన మొత్తం కార్యక్రమానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అవకాశం దక్కకపోయినా పార్టీలో ఓ క్రమశిక్షణ కగిలిన కార్యకర్తగా పార్టీ అధిష్ఠానం, అధినేత ఆదేశించే బాధ్యతలను నిర్వర్తించడమే తన పని అని హరీష్ మీడియాతో చెప్పటం ఆయనలోని క్రమశిక్షణకు నిదర్శనం. దీంతో ఇంత జరుగుతున్నా కూడా హరీష్ ఇంత మౌనంగా ఎందుకంటున్నారో జనానికి అర్థంకాని పరిస్థితి. ఏది ఏమైనా రాష్ట్రంలో హరీష్ విషయమే హాట్ హాట్‌గా నడుస్తోంది.