కల్తీ మద్యం తాగి పదిహేడు మంది మృతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కల్తీ మద్యం తాగి పదిహేడు మంది మృతి

గువహాటీ, ఫిబ్రవరి 21,  (way2newstv.com)
విషపూరిత మద్యం 17 మంది అమాయకుల ప్రాణాలు తీసింది.  అసోంలోని గోలాఘాట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.  స్థానిక హల్మీరా తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు ఒక వేడుకలో భాగంగా ఈ కలుషిత మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.  గోలాఘాట్లోని సల్మారా టీ ఎస్టేట్లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. ఇందుకోసం స్థానికంగా ఉండే ద్రౌపది ఒరాంగ్ అనే మహిళ నుంచి మద్యం తీసుకొచ్చారు. 
మద్యం సేవించిన కాసేపటికే నలుగురు మహిళలు కుప్పకూలారు.


కల్తీ మద్యం తాగి పదిహేడు మంది మృతి

 దీంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా..  అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విషపూరిత మద్యం తీసుకోవడం వల్లే వీరు మృతిచెందినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.  మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు వున్నారు. మద్యం సరఫరా చేసిన ద్రౌపది కుడా మరణించింది. దాదాపు 30 మందికి పైగా వేడుకలో పాల్గొని విషపూరిత మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  మద్యాన్ని రసాయనాల క్యాన్లో తీసుకురావడం వల్లే అది విషపూరితమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్తీ మద్యం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.