అసెంబ్లీ సాక్షిగా రోజుకో మాట - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అసెంబ్లీ సాక్షిగా రోజుకో మాట

హైదరాబాద్, ఫిబ్రవరి 13, (way2newstv.com)
టీడీపీలో కొనసాగిన 3 సంవత్సరాల నాలుగు నెలల్లో సామాజికపరంగా, రాజకీయంగా చాలా అంశాలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ కొనసాగడం సబబు కాదని నాతో సహా, నా ముఖ్య సహచరులు కూడా భావించారు. అందుకే ఆ పార్టీని వీడానని ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్ అన్నారు. బుధవారం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తరువాత అయన మీడియాతో మాట్లాడారు.  సీఎం నివాసంలో కానీ, పేషీలో కానీ ఎక్కడైనా అఫీషియల్ ఎన్రోల్మెంట్ ఎక్కడైనా చూశారా? ప్రభుత్వానికి, సమాజానికి అతీతంగా ఉండే శక్తులే పొద్దున లేస్తే చంద్రబాబును సీఎం పేషీలో కానీ, ఇంట్లో కానీ కలుస్తున్నారు. మాబోటి వాళ్లకు కానీ, సామాన్యులకు కానీ, సమాజం గురించి మాట్లాడే వారికి కానీ అక్కడ ఈసమంత కూడా స్పేస్ లేదని అయన విమర్శించారు.  


 
అసెంబ్లీ సాక్షిగా రోజుకో మాట

నేను జనసేనలోకి వెళ్తానని ఎవరితోనూ చెప్పలేదు. పవన్ కళ్యాణ్తో చాలా సార్లు రాష్ట్రం గురించి చర్చించిన మాట వాస్తవం. అలాగే 10 రోజుల క్రితం వరకు కూడా నేను జగన్మోహన్రెడ్డి ని కలుస్తానని చెప్పలేదు.   ఇప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నానంటే.. అంతా అద్భుతంగా, గొప్పగా ఉందని పార్టీ వాళ్లు చెప్పుకుంటున్నారు కదా? నిజంగా అది గొప్పగా ఉందా? మరే రకంగా ఉందా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.  రేపు నాకు ప్రత్యర్థి ఎవరనేది అప్రస్తుతం. నేనైతే వైసీపీలో చేరి, ఆ పార్టీ తరపున పోటీ చేయబోతున్నానని స్పష్టం చేసారు.  నేను పార్టీ మారడానికి నియోజకవర్గంలోని పరిస్థితులే కారణం కాదు. పొద్దున లేస్తే వాళ్లు చెప్పే అబద్ధాలు. ఉదాహరణకు.. ఇవాళ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలో ఉంది పసుపు కుంకుమ పథకం. నిజానికి పసుపు కుంకుమ అంటే ఎంతో పవిత్రమైనవి. కానీ దాన్ని ఎంత ఛండాలం చేశారంటే.. ధర్మంగా మీరు సమాచారం అందించాలని అయన సూచించారు. గత 32 నెలల నుంచి డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయతీ రూ.6500 కోట్లు ఇవ్వలేదండి. వాటిలో నుంచే మొన్న రూ.2200 కోట్లు ఇచ్చారు. కానీ అవి కూడా చేరలేదు. పవిత్రమైన పసుపు కుంకుమను చంద్రబాబు ప్రభుత్వం జారుడు బండ మీద పోసింది. దీంతో కొంత నేలమీద, కొంత గాలిలో పోతుంది.  డ్వాక్రా మహిళలకు ఇప్పుడు మొత్తం రూ.20 వేల కోట్ల అప్పులున్నాయి. వాటిని మాఫీ చేస్తానన్నాడు. కానీ చేయలేదు. కానీ వడ్డీ రాయితీ కూడా మొత్తం ఇప్పుడు ఇవ్వడం లేదు. ఆ విధంగా వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.  ఈ నీచమైనటువంటి, వరస్టు కులతత్వ వ్యవహారాన్ని ప్రశ్నించదల్చుకుని, దానికి సరైన వ్యక్తిగా, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్లాలని నిర్ణయించాను.  అసెంబ్లీ సాక్షిగా రోజుకో మాట చెబుతున్నారు. నిన్న చెప్పింది మర్చిపోండి. ఇవాళ్టిదే గుర్తు పెట్టుకోండి అన్న సిద్ధాంతంగా కనిపిస్తోంది. ఆయనకు (చంద్రబాబుకు) 70 ఏళ్లు వచ్చాయి. కాబట్టి అల్జీమర్స్ కూడా వచ్చిందా? అన్న పరిస్థితి కనిపిస్తోంది.   మనకు ప్రత్యేక హోదా అవసరం లేదని అద్భుతంగా ఒక 50 మందితో మాట్లాడించి తీర్మానం చేసి పంపిస్తారు. ప్యాకేజీ బెస్టు అంటారు. మళ్లీ ఆ మరుసటి నెలలో ఆయన వ్యక్తిగత భయాలు తెచ్చి జనం నెత్తిన రుద్దుతారు. మాట మారుస్తారని విమర్శించారు.   రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కి అప్పజెప్పింది అనుభవపరుడని. కేవలం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇచ్చారు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు. వితౌట్ ఎనీ రీజన్. అసలు మనం ఫైట్ చేసిందే హైదరాబాద్ కోసం. 10 ఏళ్లు రాజధానిగా ఉండాలని పోరాడామని అయన గుర్తు చేసారు. 
హైదరాబాద్ ఒక అద్భుత నగరం. చండీగఢ్ను పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధానిగా 5 ఏళ్ల కోసం ఇస్తే, 45 ఏళ్లుగా కొనసాగుతోంది. దటీజ్ రైట్ అడ్మినిస్ట్రేటివ్, బిజినెస్ డెసిషన్. 
– హైదరాబాద్ మన ప్రాంత పేదవాడికి అమెరికా వంటిది. ఆ నగరం 10 ఏళ్లు మనకు కూడా రాజధానిగా ఉంటుందని చెప్పారు. కానీ ఏడాదికే నగరాన్ని వదిలేసి పారిపోయి వచ్చారని విమర్శించారు.  అసలు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఏముంది? ఒక్కసారి చూడండి. రెండు దినపత్రికలను పట్టించుకోకండి. భౌతికంగా చూడండి. అక్కడ అసలు ఏముంది? ఉద్యోగులను అడగండి.  తాగడానికి మంచినీళ్లున్నాయా? కూర్చోవడానికి నాలుగు చెట్లున్నాయా? ఇక్కడ కూడా మీడియాను నమ్మొద్దు. ఫిజికల్గా వచ్చి చూడండని అన్నారు.  ఇది దుర్మార్గం. ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి, మీడియాను కూడా మేనేజ్ చేయవచ్చు కాబట్టి  ఇష్టానుసారం నిర్ణయాలు. చంద్రబాబు ఒక పరమైన కులవాదంలోకి వెళ్లిపోయాడు. ఆయన తత్వం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోలేకపోతే మేము రాజకీయాల్లో ఉండి కూడా వేస్ట్ అని అమంచి వ్యాఖ్యానించారు.