జగిత్యాల, ఫిబ్రవరి 26 (way2newstv.com)
మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్ లలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినదని జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.ఏ.శరత్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నామినేషన్లు కలెక్టర్ కార్యాలయం, కరీంనగర్ లోని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కరీంనగర్ కి గాని లేదా సహయ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి, కరీంనగర్ కి సమర్పించాలని కొరారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ
మార్చి 5న వరకు నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతుందని ,కార్యాలయ పనిదినాలనలో ఉదయం 11గంటల నుండి 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడునని పేర్కొన్నారు. స్వీకరించిన నామీనేషన్లును 6న కరీంనగర్ జిల్లా లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పరిశీలిస్తాం. ని నామినేషన్లు ఉపసంహరణ చేయదలచిన వారు 8న మద్యాహ్నం 3గంటలలోగా నేరుగా పోటీచేయు అభ్యర్థి గాని ,లేదా గుర్తించిన ఎజెంటు ద్వారా గాని వ్రాత పూర్వకంగా నామినేషన్లు ఉపసంహరించు కోవచ్చునన్నారు. 22న ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
Tags:
telangananews