రైల్వే జోన్‌ విషయంలో కేంద్రం మరోసారి మోసం: రఘువీరారెడ్డి

రాజమహేంద్రవరం ఫిబ్రవరి 28  (globelmedianews.com)
రైల్వే జోన్‌ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు. డివిజన్ బోర్డును తొలగించి జోన్ బోర్డును మాత్రమే పెట్టారని ఆయన వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా గురువారం రాజమహేంద్రవరంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. 


రైల్వే జోన్‌ విషయంలో కేంద్రం మరోసారి మోసం: రఘువీరారెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పరిణామాన్ని తమ పార్టీ స్వాగతించదన్నారు. విభజన హామీ ప్రకారం ప్రత్యేక డివిజన్‌పై ప్రకటన చేసి, ప్రధాని మోదీ రాష్ట్రానికి రావాలన్నారు. మొదటి నుంచి తాము బీజేపీని నమ్మవద్దని తెదేపాను హెచ్చరిస్తున్నామన్నారు. భాజపా ఉచ్చులో తెదేపా బిగుసుకొని రాష్ట్రానికి అన్యాయం చేసిన జాబితాలో చేరిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Previous Post Next Post