ఒంటిమిట్టలో గవర్నర్ దంపతులు

కడప,  ఫిబ్రవరి 28, (way2newstv.com)
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్  దంపతులు గురువారం ఉదయం  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.   ముందుగా  ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు టిటిడి తిరుపతి జెఈవో  బి.లక్ష్మీకాంతం, ఆలయ  అర్చక బృందం కలిసి పూర్ణకుంభంతో  స్వాగతం పలికారు. స్వామివారి  దర్శనానంతరం అర్చకులు శేషవస్త్రం బహుకరించి, వేదశీర్వా చనం అందించారు. 


ఒంటిమిట్టలో గవర్నర్ దంపతులు

అనంతరం ఆలయ  మండపంలో గవర్నరు దంపతులకు జెఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.  ఈ కార్యక్రమంలో కడప కలెక్టర్  హరికిరణ్, జాయింట్ కలెక్టర్  పి. కోటేశ్వర రావు, ఎస్పీ  రాహుల్ దేవ్ శర్మ, రాజంపేట ఆర్డీవో  కోదండరామి రెడ్డి, టిటిడి విజివో  అశోక్కుమార్ గౌడ్, ఆలయ డెప్యూటీ ఈవో  నటేష్ బాబు, ఏఈవో  రామరాజు, ఇతర తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post