ఎస్టీలకు ప్రత్యేక రాయితీలి చ్చింది తెలుగుదేశం ప్రభుత్వం

మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి 
నెల్లూరు, ఫిబ్రవరి 27(way2newstv.com
తెలుగుదేశం ప్రభుత్వం ఎస్టీలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించి వారికి ఎన్నో రాయితీలను కల్పించిందని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎస్సీ లకు 50 ఏళ్లకే పెన్షన్ కేటాయించి ఆ మేరకు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పెన్షన్ పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్టీలు బాగా వెనుకబడిన వర్గానికి చెందిన వారని అన్నారు ప్రభుత్వం నుంచి వారికి ప్రత్యేక సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు భావించారని తెలిపారు. 


ఎస్టీలకు ప్రత్యేక రాయితీలి చ్చింది తెలుగుదేశం ప్రభుత్వం

అందరూ ఇల్లు కట్టుకుంటే లక్షన్నర రూపాయలు మాత్రమే ఇస్తే ఎస్టీలకు రెండు లక్షల రూపాయలను చంద్రబాబు అందిస్తున్నారని తెలిపారు అదేవిధంగా పెళ్లి చేసుకుంటే 50 రూపాయల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేస్తున్నారని చెప్పారు అందరి లాగా కాకుండా పెన్షన్లు కూడా 50 ఏళ్లకే సడలించారు పోషకాహార లోపం వల్ల వారు తొందరగా వద్దులై పోతున్నారనే కారణంతోనే ఈ విధంగా అందజేస్తున్నారని చెప్పారు మార్చి నెల నుంచి వారికి పెన్షన్ అందజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు నెల్లూరు రూరల్ మండలం లో అందరికీ గ్యాస్ కనెక్షన్లు మరుగుదొడ్లు ఎస్టీలకు 350 ఇళ్లు అందించామ్న్నారు అదేవిధంగా సైకిళ్లు, వలలు కూడా ఇచ్చామని ,చంద్రన్న భీమా ద్వారా సహకరించా మని తెలిపారు టిడిపి ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు చేశామని అందుకే తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు వేమిరెడ్డి అశోక్ రెడ్డి హరిబాబు యాదవ్ కోడూరు కమలాకర్రెడ్డి శరత్ చంద్రారెడ్డి బండి రమేష్ రాం ప్రసాద్ సుధాకర్ యాదవ్ పముజుల ప్రదీప్, పద్మమ్మ గున్నయ్య ఇతరులు హాజరయ్యారు 
Previous Post Next Post